Begin typing your search above and press return to search.
186 కోట్ల అప్పుల ఒత్తిడి భరించలేక నిర్మాత అజ్ఞాతం!
By: Tupaki Desk | 26 Sep 2019 11:54 AM GMTఅప్పు చేసి పప్పు కూడు.. ఈ పద్ధతి సరైనదేనా? అప్పుతో ఇబ్బందులు తెలియనివా? సరిగ్గా అలాంటి సన్నివేశమే లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాష్కరణ్ అజ్ఞాతంలోకి వెళ్లేందుకు కారణమయ్యాయని తెలుస్తోంది. 2.0లాంటి భారీ చిత్రాన్ని నిర్మించిన లైకా సంస్థ ఆర్థికంగా నష్టాలు పాలవ్వడంతో ఫైనాన్షియర్లు .. అప్పులు ఇచ్చిన వాళ్లంతా ఆయనపై ఒత్తిడి పెంచుతున్నారని గత కొంతకాలంగా ప్రచారమవుతోంది. ఇలాంటి కారణాల వల్లనే ఇప్పటికే సెట్స్ పై ఉన్న `భారతీయుడు 2` రకరకాలుగా ఇబ్బందులకు గురైంది. వాయిదాల ఫర్వంలో ఈ సినిమాని తెరకెక్కించాల్సిన సన్నివేశం నెలకొంది.
ఇటీవలే రాజమండ్రి సెంట్రల్ జైల్లో భారతీయుడు 2 (ఇండియన్ 2) చిత్రీకరణ కొంత గ్యాప్ తర్వాత ప్రారంభమైన సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం మరోసారి ఈ సినిమాకి ఇబ్బందులు తప్పవని చెబుతున్నారు. లైకా అధినేత సుభాస్కరణ్ 186 కోట్ల అప్పుల పై ఒత్తిడి టెన్షన్స్ అనుభవిస్తున్నారని.. వీటివల్లనే అతడు అజ్ఞాతంలోకి వెళ్లారని ప్రచారమవుతోంది. రూ.186 కోట్లకు మోసం చేసినట్లు సుభాస్కరన్ పై ఆరోపిస్తూ ఫైనాన్షియర్లు చెన్నై పోలీస్ కమీషనర్ ని కలిసి ఫిర్యాదు చేయనున్నారన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
2.ఓ చిత్రాన్ని దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. కానీ సినిమా అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. చాలాచోట్ల పంపిణీదారులకు నష్టాలొచ్చాయి. వీటి నుంచి చైనా రిలీజ్ వల్ల అయినా రికవరీ సాధ్యపడుతుందని భావిస్తే అక్కడా సినిమా ఆశించిన వసూళ్లను సాధించలేదు. దీంతో ఒత్తిళ్లు ఎదురయ్యాయని తెలుస్తోంది. దీనివల్ల ప్రస్తుతం సెట్స్ పై ఉన్న రెండు చిత్రాలకు ముప్పు వాటిల్లుతుందని భావిస్తున్నారు. రజనీకాంత్ కథానాయకుడిగా దర్బార్.. కమల్ హాసన్ కథానాయకుడిగా భారతీయుడు 2 (ఇండియన్-2) చిత్రాల్ని లైకా సంస్థ ఏకకాలంలో నిర్మిస్తోంది. వీటికి ఇబ్బంది తప్పదని అంచనా వేస్తున్నారు. అయితే లైకా అధినేత ఈ వార్తలు అసత్యం అని ఖండిస్తూ వివరణ ఇస్తారా? అన్నది చూడాలి.