Begin typing your search above and press return to search.
బిగ్ బాస్ 5 .. ఈ వారం ఎవరు ఔట్?
By: Tupaki Desk | 20 Sep 2021 4:30 PM GMTఎన్నడూ లేనంతగా బిగ్ బాస్ గురించి .. బిగ్ బాస్ -ఓటీటీ గురించి సర్వత్రా చర్చ సాగుతోంది. ఇక తెలుగులో బిగ్ బాస్ టీవీ షో ఇటీవలే ఆరంభమై విజయవంతంగా రెండు వారాలు పూర్తి చేసుకుంది. మొదటి వారంలో సరయు.. రెండో వారంలో ఉమా దేవి ఎలిమినేట్ అయ్యారు. మూడో వారంలో నామినేషన్లలో ఐదుగురు పోటీదారులు ఉన్నారు. రెండవ వారం నామినేషన్లలో ఉన్న ప్రియా- ప్రియాంక సింగ్ మరో వారం పాటు ప్రమాద ఘంటికలను ఎదుర్కొంటారు. మానాలు నాగులపల్లి- శ్రీరామ చంద్ర- లహరి- ప్రియ- ప్రియాంక సింగ్ మూడో వారానికి నామినేషన్లలో ఉన్నారు. శ్రీరామ చంద్ర-మానాల మధ్య విబేధాలు నామినేషన్లలో ఉండటానికి ప్రధాన కారణం కావచ్చు. ఇంట్లో ప్రధాన పని సమయంలో ఇద్దరూ తోడేలు జట్టు.. డేగ జట్టుకు కెప్టెన్‌లు. ఆట సమయంలో తేడాలు నామినేషన్లలో వారి స్థానానికి దారితీయవచ్చు.
ఆ ఐదుగురిలో ప్రియ బలహీనంగా కనిపిస్తోంది. బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్ల చరిత్రను చూసినట్లయితే వయస్సులో ఉన్న కంటెస్టెంట్ లు ఇంట్లో చాలా ముందుగానే నిష్క్రమిస్తున్నారు. అందరి దృష్టిని ఆకర్షించినప్పటికీ రెండవ వారంలో ఉమా దేవి ఇంటి నుండి బయటకు వచ్చింది. ప్రియకు కూడా అదే జరగవచ్చని భావిస్తున్నారు. అయితే, షో నిర్వాహకులు చెప్పినట్లుగా ``బిగ్ బాస్ హౌస్ లో చివరి నిమిషంలో ఏదైనా జరగవచ్చు``. అంతవరకూ ఆగి చూడాలి.
ఓటీటీలో ఎలా ఉంటుందో?
బిగ్ బాస్ ఇప్పటికే నాలుగు సీజన్లను దిగ్విజయంగా పూర్తిచేసుకుని...ఐదవ సీజన్ రన్నింగ్ లో ఉంది. ఈ షో మా టీవీ టీఆర్పీ రేటింగ్ ని అమాంతం పెంచేసింది. టెలివిజన్ రంగంలో ప్రధాన పోటీ ఉన్న ఛానళ్లను అన్నింటిని ఒక్క రియాల్టీ పక్కకు నెట్టేసింది. టాలీవుడ్ బిగ్ స్టార్స్ హోస్ట్ లుగా వ్యవహరించడం సక్సెస్ లో కీలక భాగమని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ తెలుగు ఓటీటీ వెర్షన్ కి కూడా నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు. 2022 ఫిబ్రవరిలో ఈ వెర్షన్ ని లాంచ్ చేయడానికి ముహూర్తం కూడా ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఇది ఆరు వారాల పాటు కొనసాగుతుంది. ఇందులో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొంటారు.
ఓటీటీ వెర్షన్ లో ఫైనల్ కు చేరుకున్న ఒకర్ని నేరుగా బిగ్ బాస్ సీజన్-6కి ప్రమోట్ చేస్తారు. ఓటీటీ వెర్షన్ కు ఆడియన్స్ ఎక్కువగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో నిర్వాహకులు ఇలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తద్వారా ప్రేక్షకులకు ఎంటర్ టైన్ మెంట్..నిర్వాహకులకు కాసుల పంట కూడా పండతుంది. అయితే ఇది కేవలం డిస్నీ హాట్ స్టార్ లో మాత్రమే స్టీమీంగ్ అవుతుంది. ఇదే ఫార్ములాతో హిందీలో మేకర్స్ సక్సెస్ అయ్యారు. ఆ స్ఫూర్తితోనే తెలుగులోనూ లాంచ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.