Begin typing your search above and press return to search.
బిగ్ బాస్ 6 : మండే ఎపిసోడ్ మండిపోయింది.. డేంజర్ జోన్ లో అందరూ
By: Tupaki Desk | 25 Oct 2022 5:43 AM GMTతెలుగు బిగ్ బాస్ సీజన్ 6 నిన్నటి సోమవారం ఎపిసోడ్ ఎప్పటి మాదిరిగానే మంట మండింది. తాము నామినేట్ చేయాలి అనుకుంటున్న వారి యొక్క ఫోటోలను మంటల్లో వేసి తగలబెట్టి మరీ నామినేట్ చేయాలంటూ బిగ్ బాస్ ఆదేశించడంతో కంటెస్టెంట్స్ రచ్చ రచ్చగా నామినేషన్ పక్రియ లో పాల్గొన్నారు.
కొందరు ఎప్పటిలాగే సిల్లీ రీజన్స్ చెప్పగా కొందరు మాత్రం చాలా సీరియస్ గానే రీజన్స్ చెప్పి నామినేట్ చేయడం జరిగింది. రోహిత్ రెండు వారాలకు సొంతంగా నామినేట్ అయిన విషయం తెల్సిందే. దాంతో ఆయన ఈ వారం లో కూడా నామినేషన్ లో ఉంటాడు.
ఇక గత వారం టాస్క్ ల్లో భాగంగా సరిగా ఆడలేక పోవడం వల్ల నామినేట్ అయ్యింది. మొత్తం 14 మందిలో ఇద్దరు ముందుగానే నామినేట్ అయ్యారు. 12 మందిలో ఇద్దరు ఇద్దరు చొప్పున 14 మంది నామినేట్ చేయాల్సి ఉంటుంది. ఈ వారం 14 మందికి 14 మంది కూడా నామినేషన్ లో ఉన్నారు.
గీతూ మరియు రేవంత్ మధ్య సాగిన గొడవ కాస్త పీక్స్ కు చేరింది. అంతే కాకుండా అందరికి షాక్ ఇచ్చి ఇనయా మరియు సూర్య లు ఒకరిని ఒకరు నామినేట్ చేసుకున్నారు. వీరిద్దరు కావాలని సేఫ్ గేమ్ ఆడుతున్నారా లేదంటే ఇద్దరి మధ్య గొడవ ఉందా అనేది మాత్రం క్లారిటీ రావడం లేదు.
ఇక చాలా మంది శ్రీ సత్య ను చిట్టీల ఆట విషయంలో నామినేట్ చేయడం జరిగింది. అలాగే ప్రతి వారం మాదిరిగానే రేవంత్ మాటలు అదుపులో ఉంచుకోవాలంటూ నామినేట్ చేశారు. మెరినా ను అస్సలు గేమ్ ఆడటం లేదు అంటూ చాలా మంది నామినేట్ చేశారు.
ఇక గీతూ ను ఫిజికల్ గా అస్సలు ఆడటం లేదు అంటూ విమర్శిస్తూ నామినేట్ చేయడం జరిగింది. మొత్తానికి ఈ వారం అందరికి అందరు నామినేషన్ లో ఉండటంతో వీక్ గా ఉన్న వారు కచ్చితంగా వెళ్లి పోతారు అని తేలిపోయింది.
ఈ వారం మెరినా లేదా రాజ్ ల్లో ఒకరు వెళ్లి పోయే అవకాశం ఉందని అంటున్నారు. రోహిత్ కి కూడా వెళ్లి పోయే ఛాన్స్ ఉంది. వీరు ముగ్గురు కాకుండా మరెవ్వరైనా వెళ్లి పోతే అది కచ్చితంగా పెద్ద విషయమే అవుతుందని విశ్లేషకులు అంటున్నారు.