Begin typing your search above and press return to search.
జనాలను తప్పుబట్టడం సరికాదు సిరి!
By: Tupaki Desk | 21 Dec 2021 2:30 AM GMTతెలుగు బిగ్ బాస్ సీజన్ 5 లో టాప్ 5 లో నిలిచిన సిరి కి గ్రాండ్ వెల్ కమ్ దక్కింది. టాప్ 5 లో మొదటగా ఎలిమినేట్ అయిన సిరి అభిమానుల హృదయాలను గెలుచుకుంది. అయితే ఆమె షన్నూతో కాకుండా సొంతంగా గేమ్ ఆడి ఉంటే.. ఒంటరిగా తన గేమ్ ఆడి ఉంటే ఖచ్చితంగా విన్నర్ అయ్యి ఉండేది.. కనీసం రన్నర్ గా అయినా నిలిచేది అనేది అభిమానుల అభిప్రాయం. కొందరు మాత్రం షన్నూతో స్నేహం వల్లే ఆమె టాప్ 5 వరకు వచ్చింది అని కూడా అన్నారు. ఏది ఏమైనా బిగ్ బాస్ లో సిరి మరియు షన్నూల మద్య జరిగిన వ్యవహారం ను చాలా మంది చాలా రకాలుగా ఊహించేసుకుంటున్నారు. కంటెస్టెంట్స్ కొందరు అయితే బాహాటంగానే వారు స్నేహితులే కాని ఒకానొక సమయంలో వారు అంతకు మించి అయ్యారు. ఒకరి ప్రేమలో ఒకరు అన్నట్లుగా కామెంట్స్ చేశారు. జనాలు మాత్రమే కాకుండా సిరి వాళ్ల అమ్మ కూడా షన్నూ తో హగ్స్ నాకు నచ్చ లేదు అనేసి అందరికి షాక్ ఇచ్చింది.
అమ్మకే ఆమె హగ్ లు నచ్చనప్పుడు జనాలకు ఎలా నచ్చుతాయి. జనాలు అంతా కూడా షన్నూ మరియు సిరిల బాండింగ్ ను సరిగా అర్థం చేసుకోలేదు అనేది కొందరి వాదన అయితే కొందరు మాత్రం వారి మద్య అర్థం చేసుకోవడానికి సరైన స్నేహం లేదు అంటూ కామెంట్స్ చేశారు. మొత్తానికి బిగ్ బాస్ నుండి సిరి బయటకు వచ్చేసింది. లోపల ఉన్నంత కాలం ఆమెకు బయటి విషయాలు ఏమీ తెలియవు. ఒక సారి బయటకు వచ్చిన తర్వాత జనాలు ఏమనుకుంటున్నారో ఆమెకు అర్థం అయ్యింది. సోషల్ మీడియాలో వెబ్ మీడియాలో వారి గురించి రాసిన రాతలు.. మాట్లాడుకున్న మాటలు అన్ని కూడా ఆమెకు తెలిసి పోయాయి. షో నుండి బయటకు వచ్చిన వెంటనే ఆమె ఫోన్ లో అవే విషయాలను చూసుకుందట. ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ నేను అన్ని చూశాను.. కాని జనాలు తప్పుగా అర్థం చేసుకున్నారు.. నన్ను మరీ ఇంత గా నెగటివ్ చేశారు అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు.
నెగటివిటీ కొందరు చేస్తే ఈ స్థాయిలో ఆమె పై వ్యతిరేకత రాదు.. ఆమెను జనాలు కావాలని నెగటివ్ చేసే ప్రయత్నం చేయలేదు. ఆమె ప్రవర్తన వల్ల జనాల్లో నెగటివ్ అయ్యింది.. అదే జనాలు మాట్లాడుకున్నారు అనేది కొందరి అభిప్రాయం. ఈ విషయంలో జనాలను తప్పు పట్టడం సరి కాదు సిరి అంటూ కొందరు అభిమానులు స్వయంగా ఆమెకు సోషల్ మీడియా ద్వారా కామెంట్స్ చేస్తున్నారు. మీడియాలో వచ్చిన వార్తలను కాని సోషల్ మీడియాలో వచ్చిన కామెంట్స్ కాని పట్టించుకోకుండా కొత్తగా జీవితాన్ని చూసుకోవాలే తప్ప.. జనాలను తప్పు బట్టి మరింత తప్పు చేయవద్దు అంటూ ఆమెకు శ్రేయోభిలాషులు సలహా ఇస్తున్నారు. అదే ఆమెకు మంచి చేస్తుంది అనేది కొందరి సలహా.