Begin typing your search above and press return to search.
#BIGGBOSS5TELUGU E25 : కెప్టెన్ జెస్సీకి పనిష్మెంట్.. ఆకలి కేకలు
By: Tupaki Desk | 30 Sep 2021 5:30 AM GMTగెలవాలంటే తగ్గాలి టాస్క్ లో భాగంగా ఇంటి సభ్యులు తినకుండానే పడుకుండి పోయారు. కొందరు ఆకలితో అలమటిస్తే మరి కొందరు మాత్రం ఇంకా బరువు తగ్గాలంటూ తినకుండానే వాకింగ్ చేయడం మొదలు పెట్టారు. కనీస బరువు తగ్గేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేసిన ఇంటి సభ్యుల్లో సన్నీ మానస్ మరియు హమీదా శ్రీరామ చంద్రలు ఉన్నారు. ఇతర సభ్యులు గెలవాలనే పట్టుదలతో ఆడినట్లుగా కనిపించలేదు. మొత్తానికి బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ రెండవ రోజు కూడా చాలా సీరియస్ గానే సాగింది. ఒకరు ఇద్దరు ఆకలితో కేకలు పెట్టగా మరి కొందరు మాత్రం ఆకలిని తట్టుకుని గెలిచేందుకు నిలిచారు. ఈ టాస్క్ లో భాగంగా ఇంటి సభ్యులు ఆకలిపై ఒక స్కిట్ చేశారు. ఆ స్కిట్ అందరిని ఆకట్టుకుంది. జెస్సీ మరియు కాజల్ లు ఒక జంటగా ఆడి గెలిచేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. కాని వారి ఆశలు గల్లంతయ్యాయి. కెప్టెన్ జెస్సీ ఇంట్లో ఏ ఒక్కరు తినకూడదు అంటూ పదే పదే చెప్పినా కూడా ఇంటి సభ్యులు పట్టించుకోలేదు. ముఖ్యంగా సన్నీ మరియు లోబోలో ఇష్టానుసారంగా తిన్నారు. దాంతో బిగ్ బాస్ చాలా సీరియస్ అయ్యాడు. జెస్సీ సంచాలక్ గా ఇతర ఇంటి సభ్యులను కంట్రోల్ చేయడంలో విఫలం అయ్యాడు అంటూ ఆగ్రహం వ్యక్తం అయ్యింది. కెప్టెన్ గా విఫలం అవ్వడమే కాకుండా ఇంటి సభ్యులను క్రమశిక్షణలో పెట్టి టాస్క్ ను ఆడించడంలో విఫలం అయిన కారణంగా కెప్టెన్ జెస్సీకి తీవ్రమైన పనిష్మెంట్ ను బిగ్ బాస్ ఇచ్చాడు.
వెంటనే టాస్క్ నుండి కాజల్ మరియు జెస్సీని తప్పించడంతో పాటు ఈ టాస్క్ కు సంచాలక్ గా కూడా జెస్సీని తొలగించడం జరిగింది. ఈ టాస్క్ లో జెస్సీ వ్యవహరించిన తీరును బిగ్ బాస్ తీవ్రంగా కోపగించుకున్నాడు. అయితే ఇంటి సభ్యులు అందరు కూడా తాను ఎంత చెప్పినా కూడా వినిపించుకోకుండా రూల్స్ బ్రేక్ చేశారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ జెస్సీ వెళ్లి పోయాడు. టాస్క్ నుండి తమను తప్పించడంతో కాజల్ కన్నీళ్లు పెట్టుకుంది. ఆ తర్వాత కూల్ అయ్యి టాస్క్ ను నిర్వహించే బాధ్యతను తీసుకుంది. ఇంటి సభ్యులకు రెండవ బజర్ మ్రోగింది. ఆ సమయంలో విశ్వ బజర్ పై చేయి వేశాడు. రవి మరియు విశ్వలు పవర్ రూమ్ కు వెళ్లిన సమయంలో వారికి ఇచ్చిన టాస్క్ లో భాగంగా ప్రియా మరియు ప్రియాంకను ఎంపిక చేసుకోవడం జరిగింది. ఇద్దరు కూడా చాలా వీక్ అనే ఉద్దేశ్యంతో రవి వారిని ఎంపిక చేసుకున్నారు. టాస్క్ లో భాగంగా ఎవరు ఎక్కువగా కట్రెలను కొడతారో వారు విన్నర్స్. ఈ టాస్క్ లో విశ్వ మరియు రవిలు తమ ప్రతాపం చూపించారు. ప్రియా మరియు ప్రియాంకలు చాలా ప్రయత్నించినా కూడా ఫలితం లేకుండా పోయింది. ఆ టాస్క్ గెలవడంతో రవి మరియు విశ్వలు బరువు తగ్గారు. ప్రియా మరియు ప్రియాంకలు బరువు పెరిగారు.
ఆ తర్వాత బజర్ కు సన్నీ చేయి పెట్టాడు. వారు లోబో మరియు నటరాజ్ మాస్టర్ లను తమ టాస్క్ కు ఎంపిక చేసుకోవడం జరిగింది. వీరు మునుగుతుందా.. తేలుతుందా అనే టాస్క్ ను ఆడారు. గార్డెన్ ఏరియాలో ఉన్న ఒక టబ్ లో కొన్ని వస్తులువు వేస్తే అవి మునుగుతాయా లేదా అనే విషయాన్ని చెప్పాలి. ఈ టాస్క్ లో ఒక్క పాయింట్ తేడాతో సన్నీ మరియు మానస్ లు విజయం సాధించారు. దాంతో వారి బరువు తగ్గింది. ఈ టాస్క్ లో ఇప్పటికే రెండు సార్లు బరువు పెరిగిన లోబో మరియు నటరాజ్ లు ఇక టాస్క్ నుండి బయటకు వచ్చేసినట్లే అయ్యింది. మరో వైపు ఇంటి సభ్యులు ఆకలితో అలమటిస్తూ వచ్చారు. ఒకానొక సమయంలో లోబో చెత్త కవర్ లో వేసిన ఆహారం ను తీసుకుని తినేందుకు ప్రయత్నించాడు. అతడి విషయంలో ఇంటి సభ్యులు ఎమోషనల్ అయ్యారు. నటరాజ్ మాస్టర్ ఈ టాస్క్ ను తాను గేవప్ చేస్తున్నట్లుగా ప్రకటించాడు. కాని లోబో మాత్రం ఒప్పుకోలేదు. ఇక ఇంటి సభ్యులు అందరి కోసం మటర్ బిర్యానీ వచ్చింది. సన్నీ మానస్... శ్రీరామ్ హమీదా మరియు షణ్ను మరియు సిరిలు తినలేదు. ఇతర ఇంటి సభ్యులు అంతా కూడా ఆ ఫుడ్ ను తినేశారు. బిగ్ బాస్ ఆ ఫుడ్ అందరి కోసం అంటూ పంపించాడు కాని ఎవరి ఇష్టం వారు తినాలనుకుంటే తినవచ్చు అన్నారు. దాంతో వారు మిగిలి పోయారు. తదుపరి ఎపిసోడ్ లో కొత్త కెప్టెన్ ఎంపిక అవ్వబోతున్నాడు. ఈ టాస్క్ లో విజేతలు ఎవరు అనేది కూడా తదుపరి ఎపిసోడ్ లో ప్రసారం కాబోతుంది.