Begin typing your search above and press return to search.

#BIGGBOSS5TELUGU E4 : నిన్న కాజల్ తో నేడు హమీదతో లహరి లడాయి

By:  Tupaki Desk   |   9 Sep 2021 5:30 AM GMT
#BIGGBOSS5TELUGU E4 : నిన్న కాజల్ తో నేడు హమీదతో లహరి లడాయి
X
బిగ్‌ బాస్‌ హౌస్‌ లో ప్రతిసారి గొడవలు.. అలగడాలు కామన్‌. కాని ఈసారి అవి ఇంకాస్త ఎక్కువ అన్నట్లుగా అనిపిస్తుంది. క్రితం ఎపిసోడ్‌ లో లహరి మరియు కాజల్‌ ల మద్య వేడి వేడిగా చర్చ జరిగింది. ఆ చర్చలో కాజల్ కాస్త హైపర్‌ అయ్యింది. దానికి లహరి అతిగా రియాక్ట్‌ అయ్యింది. ఇద్దరి మద్య మళ్లీ రచ్చ రచ్చ గొడవ జరుగుతుంది అనుకున్న సమయంలో అనూహ్యంగా ఇద్దరు కూడా సైలెంట్ అయ్యారు. కాజల్‌ తన పద్దతి ప్రకారం గొడవను సర్దుమనిగేలా చేసింది. ఇద్దరి మద్య తాజా ఎపిసోడ్‌ లో ఎలాంటి వ్యవహారం జరగలేదు. కాని ఈసారి లహరి టార్గెట్‌ హమీద అయ్యింది. హమీద చేసిన పని వల్ల లహరికి కోపం వచ్చింది. కోపంలో ఉన్న లహరి మరింత రెచ్చి పోయేలా హమీద మాటలు మాట్లాడటంతో గొడవ మరింతగా ముదిరినట్లయ్యింది. మొత్తానికి వివాదం అంతకంతకు పెరిగి పోయింది. కాజల్‌ తో ఎలా అయితే గొడవ సర్దమనిగిందో అలాగే హమీదాతో కూడా లహరి గొడవ తగ్గిపోయింది. ఆమె ను హగ్‌ చేసుకున్న హమీద గొడవకు ఫుల్‌ స్టాప్ పెట్టింది.

తాజా ఎపిసోడ్‌ లో ఇంకా జరిగిన పరిణామాల గురించి చూస్తే.. అర్థరాత్రి రెండు మూడు దాటినా కూడా ఇంటి సభ్యులు పడుకోక పోవడంతో కాజల్‌ పడుకోకుండా ఉండాల్సి వచ్చింది. వారిని వెళ్లి పడుకోమని రిక్వెస్ట్‌ చేసినా కూడా పడుకనేందుకు నో చెప్పారు. ముఖ్యంగా హమీదా మరియు లహరిలు పడుకోవడానికి నో చెప్పారు. దాంతో కాజల్‌ పడుకుంది. ఆ సమయంలో అలారం వచ్చింది. అలా రెండు సార్లు కూడా అలారం వచ్చింది. కాజల్ పడుకున్న వెంటనే అలారం వస్తూ ఉంది. టాస్క్ కోసం కొందరు తెల్ల వార్లు పడుకోకుండా ఉన్నారు. పవర్‌ రూమ్‌ బజర్‌ వస్తుందేమో అనే ఉద్దేశ్యంతో వారు అక్కడే కూర్చుండి పోయారు. ఇక క్రితం ఎపిసోడ్‌ లో అనీ మాస్టర్ మరియు జెస్సీల మద్య జరిగిన గొడవ కూడా తాజా ఎపిసోడ్‌ లో ఒక ఫుల్‌ స్టాప్ పడింది. జెస్సీ వెళ్లి అనీ మాస్టర్‌ కాళ్లు పట్టుకుని క్షమాపణ చెప్పేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో ఆమె కూడా తన హైపర్‌ కు సారీ చెప్పారు. మొత్తానికి ఇద్దరి మద్య గొడవ సమసి పోయినట్లే అనిపించింది. ఇక ప్రియాంక తో తన విషయాన్ని మాట్లాడటంపై మానస్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. తన గురించి అతడు మాట్లాడటం నచ్చలేదు అన్నాడు. మొత్తానికి ప్రియాంక వ్యవహారంలో మానస్ చాలా అసంతృప్తిగా ఉన్నట్లుగా అనిపిస్తుంది.

ఇక తాజా ఎపిసోడ్‌ లో మరో హైలైట్‌ ఏంటీ అంటే ఉమా గారు తనకు లేకుండా పాలకూరను అనీ మాస్టర్ దాచి పెట్టింది అంటూ గొడవ మొదలు పెట్టింది. తాను తినేందుకు చూసిన సమయంలో కూర లేదు అని ఉమ అంటే తాను తర్వాత తినేవారి కోసం నేను ఉంచాను అంటూ చెప్పే ప్రయత్నం చేసింది. అందుకు ఉమా మొదట తినడం కంటే రెండవ సారి తినే వారికి కూర ఉంటుంది. అంటే అందరితో కాకుండా చివరకు తింటేనే కూర ఉంటుందా అంటూ కాస్త సీరియస్ గానే ఉమా దేవి సీరియస్ అయ్యింది. ఆ తర్వాత ఇద్దరు కూడా కాస్త చిల్ అయ్యారు.

పవర్ రూమ్ టాస్క్ విషయానికి వస్తే మూడవ ఛాన్స్ సిరికి దక్కింది. సిరి ఇద్దరిని ఎంపిక చేసుకుని వారిలో ఒకరిని సేవకుడిగా ఒకరిని యజమానికి గా ఎంపిక చేసుకోవాలి. అందుకు షన్ముఖ్‌ ను ఓనర్ గా లోబోను సేవకుడిగా ఎంపిక చేసింది. షన్ముఖ్ కు సేవకుడిగా లోబో అందరిని ఎంటర్ టైన్ చేశాడు. ఇక మద్యలో హమీద మరియు శ్రీరామ చంద్రల రొమాంటిక్ మాటలు సాగాయి. షో మెల్ల మెల్లగా ఇంట్రెస్టింగ్ గా మారుతోంది. మరి తదుపరి ఎపిసోడ్‌ లో ఏం జరిగింది.. ఇంకా బిగ్‌ బాస్ అప్ డేట్స్ కోసం మమ్ముల ఫాలో అవ్వండి.