Begin typing your search above and press return to search.
#BIGGBOSS5TELUGU లీక్ : బూతుల సరయు ఔట్
By: Tupaki Desk | 12 Sep 2021 5:54 AM GMTబిగ్ బాస్ సీజన్ 5 మొదటి ఎలిమినేషన్ ను నేడు ఎపిసోడ్ లో జరుగబోతుంది. ఎలిమినేషన్ కు నామినేట్ అయిన యాంకర్ రవి.. సరయు.. హమీద.. జెస్సీ.. మానస్ మరియు కాజల్ లలో రవి మరియు హమీదాలు సేఫ్ అయ్యారు. ఇంకా నలుగురు అన్ సేఫ్ లోనే ఉన్నారు. నలుగురిలో ఒక్కరు మాత్రం ఎలిమినేట్ అవ్వబోతున్నారు. ఆ ఒక్కరు ఎవరు అనేది ఇప్పటికే తేలిపోయింది. షూటింగ్ శనివారం సాయంత్రం వరకు ముగిసింది కనుక గతంలో మాదిరిగా మళ్లీ లీక్ అయ్యింది. సరయు ఈ సీజన్ ఫస్ట్ ఎలిమినేషన్ అంటూ వార్తలు వస్తున్నాయి. బిగ్ బాస్ విషయాలు చాలా కామన్ గా లీక్ అవుతూనే ఉన్నాయి. ఈ సీజన్ కూడా ప్రతి వారం ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనే విషయాన్ని లీక్ అవ్వబోతుంది అనే విషయం దీంతో క్లారిటీ వచ్చేసింది. ఈ సీజన్ ఫస్ట్ ఎలిమినేషన్ బూతుల సరయు అంటూ సోషల్ మీడియాలో కోడై కూస్తున్నారు.
శనివారం ఎపిసోడ్ లో సరయు నీ స్టైల్ ఏమైంది అంటూ నాగార్జున అడిగిన సమయంలో మీరు ఏమంటారో అనే భయం అంటూ సరయు చెప్పుకొచ్చింది. నాగ్ నీవు నీలా ఉండు అంటూ చెప్పిన సమయంలో ఇక నుండి రచ్చ రచ్చే అన్నట్లుగా అంతా భావించారు. కాని నేటి ఎపిసోడ్ తో సరయు బయటకు వచ్చేస్తోంది. అంతా కాజల్ లేదా జెస్సీ అనుకున్నారు. కాని సరయు పద్దతి నచ్చడం లేదని చాలా మంది ఆమెకు ఓట్లు వేయలేదని తెలుస్తోంది. సరయు మరియు కాజల్ ఇద్దరిలో టఫ్ కాంపిటీషన్ ఓటింగ్ లో సాగిందట. చివరకు సరయు తక్కువ ఓట్లతో చివరి స్థానంలో నిలవడంతో ఆమెను ఎలిమినేట్ చేశారు అనేది టాక్.
బిగ్ బాస్ సీజన్ సీజన్ 5 ఆరంభం అయిన తర్వాత కొందరు సైలెంట్ గా ఉంటే కొందరు వైలెంట్ అవుతున్నారు. అందరిని విమర్శించినట్లుగా మాట్లాడటం ఆ తర్వాత కవర్ చేసుకోవడం వంటివి సరయు చేస్తున్న తప్పులుగా అందరు అంటున్నారు. అందుకే బిగ్ బాస్ మొదటి వారం నుండే ఆమెను బయటకు పంపించారు అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయమై నూరు శాతం క్లారిటీ రావాలంటే నేటి ఎపిసోడ్ టెలికాస్ట్ అవ్వాల్సిందే.
ఈవారంలో కనుక జెస్సీ బయట పడితే అతడికి మంచి లైఫ్ దక్కినట్లే. ముందు ముందు అతడి నుండి మంచి ఆట చూడవచ్చు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక కాజల్ కూడా ఈ వారం సేఫ్ అయితే ముందు ముందు ఆమె మొదటి వారం చేసిన అతి చేయక పోవచ్చు. ఉమా కూడా తన ప్రవర్తన విషయంలో మార్పు తీసుకు వచ్చే అవకాశాలు లేకపోలేదు. ఇక నాగార్జున చెప్పినట్లుగా షణ్ముఖ్ కూడా యాక్టివ్ అవుతాడని అంటున్నారు. నేటి ఎపిసోడ్ లో నాగ్ ఏ రేంజ్ లో ఎంటర్ టైన్ చేస్తాడు అనేది చూడాలి.