Begin typing your search above and press return to search.
#BIGGBOSS5TELUGU ః ఈసారికి సర్ ప్రైజ్ ఎలిమెంట్ లేనట్లే!
By: Tupaki Desk | 28 Sep 2021 6:31 AM GMTతెలుగు బిగ్ బాస్ సీజన్ 5 మూడు వారాలు ముగించుకుని నాల్గవ వారంలోకి అడుగు పెట్టింది. గతంలో వచ్చిన తెలుగు సీజన్ లు అయితే ఏంటీ.. హిందీ లేదా ఇతర భాషల్లో వచ్చిన బిగ్ బాస్ సీజన్ ల్లో అయితే ఏంటీ ఖచ్చితంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ లు అనేవి ఉన్నాయి. రెండు మూడు వారాలు లేదా నాలుగు వారాల వరకు కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉంటూనే ఉంటాయి. సమయం సందర్బం అనుసారంగా ఇద్దరు లేదా ముగ్గురు కూడా వైల్డ్ కార్డ్ తో ఎంట్రీ ఇచ్చిన సందర్బాలు ఉన్నాయి. అందుకే ఈసారి తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 లో మూడవ వారంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుందని అంతా ఊహించారు. కాని నాల్గవ వారం ప్రారంభం అయ్యింది. ఇప్పటి వరకు వైల్డ్ ఎంట్రీ గురించిన ప్రత్యేక చర్చ కాని మరేమైనా కాని స్టార్ మా నుండి లీక్ అవ్వడం లేదు. బిగ్ బాస్ లో ఈసారికి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉండక పోవచ్చు అనే అభిప్రాయంను బుల్లి తెర వర్గాల వారు అంటున్నారు.
కరోనా కారణంగా ప్రతి కంటెస్టెంట్ ను రెండు వారాల పాటు ఐసోలేషన్ లో ఉంచి.. వారి క్వారెంటైన్ హెల్త్ రిపోర్ట్ అంతా కూడా పరిశీలించిన తర్వాత అప్పుడు వారిని బిగ్ బాస్ హౌస్ లోకి పంపించడం జరిగింది. మళ్లీ ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీని పంపించాలంటే చాలా పెద్ద తతంగం ఉంటుంది. రెండు వారాల పాటు ప్రత్యేక క్వారెంటైన్ లో ఉండాల్సి ఉంటుంది.. ఆ తర్వాత బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వాలి. ఒకవేళ వైల్డ్ ఎంట్రీ ఉండి ఉంటే ఇప్పటికే ఆ క్యాండిడేట్ ను క్వారెంటైన్ చేసి ఉండాలి. కాని స్టార్ మా వారి నుండి అలాంటి సమాచారం ఏమీ లేదు. పైగా ఈసీజన్ ఆరంభంలోనే ఎక్కువ మందిని హౌస్ లోకి పంపించారు. కనుక మళ్లీ వైల్డ్ ఎంట్రీ తో పంపించాల్సిన అవసరం రాలేదు అంటూ బిగ్ బాస్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితులు చూస్తుంటే ఈసారి సర్ ప్రైజ్ ఎలిమెంట్ అయిన వైల్డ్ కార్డ్ ఎంట్రీ లేదని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన వారిపై ప్రేక్షకులు ఆసక్తి చూపించడం లేదు. గత సీజన్ ల్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన వారిని ఎక్కువ శాతం వెంటనే బయటకు పంపించేస్తున్నారు. వారు మద్యలో వచ్చారు కనుక వారికి ఎక్కువగా ఓట్లు వేయడం భావ్యం కాదు అనేది కొందరి అభిప్రాయం. అందుకే తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ లేనట్లే అని తేలిపోయింది. కరోనా భయంతో పాటు ఇతర విషయాలను పరిగణలోకి తీసుకున్న నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. మూడు వారాలు ముగించుకున్న బిగ్ బాస్ సీజన్ 5 కు మంచి రేటింగ్ వస్తోంది. ఇంట్లో ఉన్న కంటెస్టెంట్స్ ఎవరికి వారు అన్నట్లుగా రెచ్చి పోయి మరీ ఆడుతున్నారు. పోటా పోటీగా సాగుతున్న టాస్క్ లు మరియు ఇతర విషయాలు షో ను ఆసక్తిగా మార్చుతున్నారు. ఇప్పటి వరకు సరయు.. ఉమాదేవి మరియు లహరిలు ఎలిమినేట్ అయ్యారు. ఈ వారంలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది చూడాలి.