Begin typing your search above and press return to search.

#BIGGBOSS5TELUGU : సరయు ఎక్కడ?

By:  Tupaki Desk   |   15 Sep 2021 6:54 AM GMT
#BIGGBOSS5TELUGU : సరయు ఎక్కడ?
X
తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 5 నుండి మొదటి వారం లోనే ఎలిమినేట్‌ అయిన 7 ఆర్ట్స్ సరయు కనిపించడం లేదు. సాదారణంగా బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన వెంటనే పలు మీడియా సంస్థల్లో ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటారు. బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో కనిపించిన సరయు ఆ తర్వాత ఎక్కడ కూడా కనిపించలేదు. ఆమె అసలు ఏమై పోయింది.. ఎక్కడ ఉందని మీడియా వర్గాల వారు తెగ గాలిస్తున్నారు. ఎక్కడ ఉన్నా ఆమెతో ఒక ఇంటర్వ్యూ తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కాని ఆమె మాత్రం ఫోన్ ద్వారా రెస్పాండ్‌ అవ్వడం లేదు.. సన్నిహితుల ద్వారా కలిసేందుకు ప్రయత్నించగా వీలు పడటం లేదట. ప్రముఖ న్యూస్‌ ఛానల్‌ ప్రతినిధి మాట్లాడుతూ ఆమె మొదటి వారంలోనే ఎలిమినేట్‌ అవ్వడం వల్ల చాలా డిస్ట్రబ్‌ అయ్యింది. అందుకే ఆమె ఎవరిని కలిసేందుకు ఆసక్తి చూపడం లేదట అన్నాడు.

యూట్యూబ్ లో అడల్ట్‌ కంటెంట్‌ తో జనాల్లో మంచి గుర్తింపునే తెచ్చుకున్న సరయుకు బిగ్‌ బాస్ ఛాన్స్ అంటే చాలా బిగ్ ఛాన్స్. అంతటి బూతుల సరయును ఎలా బిగ్‌ బాస్ లో తీసుకున్నారు అంటూ కొందరు అనుమానం వ్యక్తం చేయగా కొందరు ఆమె ఉండటం వల్ల ఖచ్చితంగా షో లో రచ్చ రచ్చ ఉంటుందని.. ఫ్యామిలీ ఆడియన్స్ చూసేలా కాకుండా యూత్ ఆడియన్స్ చూసే విధంగా ఉంటుంది అంటూ కొందరు కామెంట్స్ చేశారు. ఆమె ఇంట్లో ఉన్న వారం రోజుల పాటు టెలికాస్ట్‌ చేసిన దాంట్లో ఒకటి రెండు సాదారణ బూతులు మినహా అంతకు మించి మాట్లాడినట్లుగా చూపించలేదు. టెలికాస్ట్‌ కాని చోట ఆమె బూతులు మాట్లాడి ఉండవచ్చు అది వేరే విషయం. కాని ఆమె జనాల్లోకి వెళ్లేలా మాత్రం ఆమెకు సంబంధించిన ఫుటేజ్ ను టెలికాస్ట్‌ చేయలేదు అంటూ ఆమె కోపంగా ఉందట.

కనీసం కొన్ని వారాలు అయినా ఉంటాను అనుకున్న సరయు మొదటి వారంలోనే బయటకు వచ్చింది. దాంతో తన పరువు పోయిందనే ఆవేదన ఆమెలో కనిపిస్తుంది. ఆ ఆవేదన ఆవేశంగా మారింది.. ఉక్రోశంతో ఆమె రెచ్చి పోయి మరీ బిగ్ బాస్ బజ్ లో అరియానా ముందు చేసిన పని అందరికి కూడా షాకింగ్‌ గా ఉంది. అరియానా ఇంటర్వ్యూలో ఆమెకు ఇచ్చిన ఫొటోలను అత్యంత దారుణంగా విరుగ్గొట్టింది. ఆమె కొందరు కంటెస్టెంట్స్ పై చేసిన వ్యాఖ్యలు మరీ రాయడానికి కూడా లేనంతగా ఉన్నాయి. అంతటి మాటలు అన్న ఆమె ఆ తర్వాత ఇంటర్వ్యూల్లో మరింతగా రెచ్చి పోయి కంటెస్టెంట్స్ పై వ్యాఖ్యలు చేస్తుందని అంతా అనుకున్నారు. కాని ఇప్పటి వరకు ఆమె ఇంటర్వ్యూ ఒక్కటి అంటే ఒక్కటి కూడా బయటకు రాలేదు. అరియానాతో ఇంటర్వ్యూ తప్ప ఆమె ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వక పోవడంకు కారణం ఏంటీ.. ఇంతకు సరయు ఇప్పుడు ఎక్కడ ఉంది అనే ప్రశ్నలు సోషల్‌ మీడియాలో కనిపిస్తున్నాయి.