Begin typing your search above and press return to search.
#BIGGBOSS5TELUGU : ఈవారం ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే..!
By: Tupaki Desk | 25 Sep 2021 11:30 AM GMTబిగ్ బాస్ తెలుగు సీజన్ 5 నుండి మూడవ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ వారం ఎలిమినేషన్ లో ప్రియాంక.. ప్రియా.. లహరి.. మానస్ మరియు శ్రీరామ చంద్రలు ఉన్నారు. వీరిలో ప్రియా మరియు లహరిల మద్య పోటీ తీవ్రంగా ఉందట. వీరిద్దరిలో ఒకరు ఎలిమినేట్ అవ్వడం దాదాపుగా కన్ఫర్మ్ అంటూ సోషల్ మీడియా టాక్. తాజాగా స్టార్ మా టీమ్ నుండి అందుతున్న లీక్ ప్రకారం లహరి కి ప్రియా కంటే కాస్త తక్కువ ఓట్లు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఓట్ల ప్రకారంగా ఎలిమినేట్ చేస్తే కనుక లహరి ఔట్ అవ్వడం ఖాయంగా అనిపిస్తుంది. కాని షో నిర్వాహకులకు కొన్ని లెక్కలు.. కొన్ని స్టాటజీలు ఫాలో అవుతారు. లహరి ఉంటే ఇంట్లో రొమాన్స్ ఉంటుందని.. లేదా మరేదైనా ప్రేక్షకులు ఆసక్తి కలిగించే అంశాలు జరుగుతాయి అనుకుంటే ఆమెను ఉంచేసే అవకాశం ఉంటుంది.
అన్ని సార్లు ఓట్ల ద్వారా కాకుండా కొన్ని సార్లు షో క్రియేటివ్ టీమ్ ఆ కంటెస్టెంట్ కు ఉన్న స్టామినా ఇతర విషయాలను దృష్టిలో ఉంచుకుని కూడా ఎలిమినేషన్ చేస్తారనే టాక్ ఉంది. అందుకే ప్రియా మరియు లహరిల్లో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది సీరియస్ అంశంగా మారింది. వీరిద్దరు కూడా షో కు అవసరం అనుకుంటే వేరే వారిని కూడా ఎలిమినేట్ చేయడంకు షో నిర్వాహకులు వెనక్కు తగ్గక పోవచ్చు. కాని వీరిద్దరితో పోల్చితే ఇతర ముగ్గురు చాలా స్ట్రాంగ్ మరియు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు ఆధరణ ఉన్నారు. షో లో కంటెంట్ మేకర్స్. అందుకే లహరి మరియు ప్రియాల్లో మాత్రమే ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇద్దరిలో కూడా ఒక్కరి పేరు చెప్పాలంటే మాత్రం ఎక్కువ శాతం లహరి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
ప్రియా ఈ వారం నామినేషన్ సమయంలో కాస్త సీరియస్ అయ్యారు. ఆమె రవి మరియు లహరిల మద్య విషయాన్ని కాస్త విభిన్నంగా చూపించే ప్రయత్నం చేశారు. అలా ఎలా మాట్లాడుతారు అంటూ ఆమెను అభిమానించే వారు కూడా కొందరు ఆమెను ప్రశ్నించారు. అందుకే ఈవారం ఆమెకు కాస్త మార్కులు తక్కువ పడి ఉంటాయని అంటున్నారు. లహరి కూడా పదే పదే చిన్న విషయాలకు హైపర్ అవ్వడం వల్ల విమర్శలు మూట కట్టుకుంటుంది. అందుకే ప్రియా మరియు లహరిలకు ఇద్దరికి కూడా మైనస్ లు ఉన్నాయి. ఎలిమినేషన్ డే తర్వాత ప్రియా అందరితో కలిసి పోయేందుకు ప్రయత్నించింది. ఆమె మళ్లీ తిరిగి మామూలుగా మారిపోయింది. కాని జరగాల్సిన నష్టం అయితే జరిగింది. కనుక ఏం జరుగుతుంది అనేది రేపటి ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. మరి కొన్ని గంటల్లో అనధికారికంగా ఎలిమినేషన్ కు సంబంధించిన లీక్ కూడా వస్తుంది. ఇద్దరిలో ఎవరు ఎలిమినేట్ అయ్యారు అనేది మరికాసేపట్లో క్లారిటీ వచ్చేయనుంది.