Begin typing your search above and press return to search.
తమన్‌కిది బిగ్గెస్ట్ అచీవ్మెంట్
By: Tupaki Desk | 19 July 2021 7:46 AM GMT‘కిక్’ లాంటి బ్లాక్ బస్టర్ మూవీతో సంగీత దర్శకుడిగా అరంగేట్రం చేసి, కెరీర్ ఆరంభంలోనే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు తమన్. అప్పట్నుంచి అతను ఎప్పుడూ ఖాళీగా ఉన్నది లేదు. పెద్ద పెద్ద స్టార్లతోనే పని చేస్తూ వచ్చాడు. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్.. ఇలా పెద్ద పెద్ద స్టార్లతో సినిమాలు చేశాడు. కానీ తమన్ మీద మెజారిటీ ప్రేక్షకుల్లో అంత మంచి అభిప్రాయం లేకపోయేది. అందుక్కారణం.. అతడి సంగీతం రొటీన్‌గా ఉంటుందని, ఒకే ట్యూన్లను రిపీట్ చేస్తుంటాడని.. కాపీ కొడుతుంటాడని పడ్డ ముద్రే. వివిధ సందర్భంగా తన మాటల ద్వారా తమన్ జవాబు చెప్పే ప్రయత్నం చేసినా జనాలు సమాధాన పడలేదు.
కానీ గత కొన్నేళ్లుగా తమన్ మాటలు మానేసి తన పనితోనే ఈ విమర్శలన్నింటికీ సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. దీంతో కథ మొత్తం మారిపోయింది. తమన్ మీద జనాల అభిప్రాయమే మారిపోయింది. ఒకప్పుడు అతణ్ని విమర్శించిన వాళ్లు సైతం అభిమానిస్తున్నారంటే గత కొన్నేళ్లలో అతను అందించిన అద్భుతమైన ఆడియోలు, బ్యాగ్రౌండ్ స్కోర్లే కారణం. గత ఏడాది ‘అల వైకుంఠపురములో’లో సినిమాతో తమన్ ఎంతగా అలరించాడో తెలిసిందే. ఈ మధ్యే ‘వకీల్ సాబ్’తోనూ ఉర్రూతలూగించాడు. దీంతో పెద్ద పెద్ద దర్శకులు, హీరోలు ఏరి కోరి తమన్‌ను ఎంచుకుంటున్నారు. చివరికిప్పుడు శంకర్ లెజెండరీ డైరెక్టర్‌కు సైతం తమనే ఛాయిస్ అయ్యాడు.
కెరీర్ ఆరంభం నుంచి శంకర్ ఫేవరెట్ రెహమానే. కేవలం రెండే రెండు సినిమాలకు మాత్రం హ్యారిస్ జైరాజ్‌తో పని చేశాడు. ‘ఇండియన్-2’కు అనిరుధ్‌ను ఎంచుకున్నాడు కానీ.. ఆ సినిమా ఎటూ కాకుండా పోయింది. చరణ్‌తో శంకర్ చేయనున్న చిత్రానికి ముందు రెహమానే సంగీత దర్శకుడన్నారు. తర్వాత అనిరుధ్ పేరూ వినిపించింది. కానీ చివరికి తమన్ పేరు తెరపైకి వచ్చింది. ఈ రోజు అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించారు. రెహమాన్ లాంటి లెజెండ్‌ను రీప్లేస్ చేసే అవకాశం దక్కడం అంటే తమన్ ఎంతో ఎదిగిపోయినట్లే. ఒకప్పుడు శంకర్ రూపొందించిన ‘బాయ్స్’లో ప్రధాన పాత్రధారుల్లో ఒకడిగా కనిపించిన తమన్.. ఇప్పుడు ఆయన సినిమాకు సంగీతం అందిస్తుండటం విశేషమే.