Begin typing your search above and press return to search.

అతి పెద్ద మల్టీస్టారర్‌ కమింగ్ సూన్‌

By:  Tupaki Desk   |   31 Aug 2022 6:30 AM GMT
అతి పెద్ద మల్టీస్టారర్‌ కమింగ్ సూన్‌
X
స్టార్‌ హీరోల యొక్క మల్టీ స్టారర్ సినిమాలకు అన్ని భాషల్లో కూడా విపరీతమైన క్రేజ్ ఉంది అనడంలో సందేహం లేదు. అయితే ఫ్యాన్ ఫాలోయింగ్... బడ్జెట్‌.. కథ ఇలా ఎన్నో కారణాలు చెబుతూ స్టార్‌ హీరోలు మల్టీ స్టారర్‌ సినిమాలు అంటే కాస్త పక్కకు తప్పుకుంటున్నారు. అన్ని భాషల్లో కూడా మల్టీస్టారర్ సినిమాలు కరువు అయిన ఈ సందర్భంలో ఒక భారీ మల్టీ స్టారర్‌ ప్రకటన వచ్చింది.

ఇటీవలే తెలుగు లో చాలా దశాబ్దాల తర్వాత సమ ఉజ్జీలు అయిన స్టార్‌ హీరోల మల్టీ స్టారర్‌ సినిమా ఆర్ ఆర్‌ ఆర్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ స్థాయి మల్టీ స్టారర్‌ అతి త్వరలోనే తమిళంలో రాబోతున్నట్లుగా తెలుస్తోంది. తమిళ సూపర్‌ స్టార్‌ విజయ్ తో తాను కలిసి నటించేందుకు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అంటూ స్టార్‌ హీరో విక్రమ్‌ అధికారికంగా ప్రకటించాడు.

విక్రమ్‌ నటించిన 'కోబ్ర' సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గత నెల రోజులుగా సినిమా కు భారీ ఎత్తున పబ్లిసిటీ చేస్తున్నారు. తమిళంతో పాటు తెలుగు లో కూడా ఈ సినిమాను వినాయక చవితి సందర్భంగా భారీ ఎత్తున విడుదల చేయడం జరిగింది. సినిమా విడుదల సందర్భంగా సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో విక్రమ్‌ ముచ్చటించాడు.

ఆ సందర్భంగా తమిళ సూపర్ స్టార్‌ విజయ్ గురించి అభిమానులు ప్రశ్నించారు. ఆ సందర్భంగా విజయ్ గురించి చాలా గొప్పగా విక్రమ్‌ మాట్లాడాడు. ఆయన డాన్స్ అంటే తనకు ఇష్టం అని... అతడి నటన అంటే చాలా ఇష్టం అన్నాడు. అలాగే విజయ్‌ యొక్క సెన్సాఫ్ హ్యూమర్‌ ని నేను ప్రేమిస్తాను అన్నాడు.

డాన్స్ లో స్టైల్‌ మొదలుకుని బాడీ లాంగ్వేజ్ లో స్టైల్ వరకు అన్నింట్లో కూడా నాకు విజయ్‌ నచ్చుతాడు అన్నాడు. భవిష్యత్తులో విజయ్‌ తో కచ్చితంగా ఒక సినిమా ఉంటుంది.. అది కూడా కోబ్రా సినిమా దర్శకుడు అజయ్‌ జ్ఞానముత్తు దర్శకత్వంలో ఉండబోతుందని విక్రమ్‌ బలంగా నమ్మకంగా ప్రకటించాడు.

ఇప్పటికే అజయ్‌ జ్ఞానముత్తు ఒక మంచి కథను రెడీ చేశాడట.. ఆ కథ విజయ్‌ మరియు విక్రమ్‌ ల యొక్క స్టార్‌ డమ్ కి తగ్గట్లుగా ఉంటుందని అంటున్నారు. తప్పకుండా ఆ సినిమా రాబోయే భవిష్యత్తులో వర్కౌట్ అవుతుందని ప్రతి ఒక్కరు నమ్మకంతో ఉన్నారు. మరి విజయ్ ఏమంటాడో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.