Begin typing your search above and press return to search.

బాలయ్య కెరీర్‌ లో బిగ్గెస్ట్‌ నెంబర్‌

By:  Tupaki Desk   |   1 May 2021 11:32 AM GMT
బాలయ్య కెరీర్‌ లో బిగ్గెస్ట్‌ నెంబర్‌
X
నందమూరి బాలకృష్ణ మరియు బోయపాటి శ్రీనుల కాంబోలో రూపొందుతున్న మూడవ సినిమా అఖండ పై అంచనాలు ఆకాశమే హద్దు అన్నట్లుగా ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్‌ ముగింపు దశకు వచ్చింది. ఈ నెల చివరి వారంలో సినిమా విడుదల అవ్వాల్సి ఉన్నా కూడా కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. సినిమా పై ఉన్న అంచనాల నేపథ్యంలో ఓటీటీ మరియు శాటిలైట్‌ రైట్స్ కు గాను కోట్లు కుమ్మరించేందుకు ప్రముఖ సంస్థలు ముందుకు వచ్చాయి.

ఈ సినిమా కు ఉన్న క్రేజ్ నేపథ్యంలో స్టార్ మా వారు ఏకంగా రూ.19 కోట్లను చెల్లించేందుకు ముందుకు వచ్చిందట. ఇప్పటికే చర్చలు ముగిశాయని త్వరలోనే ఒప్పందం కూడా పూర్తి అవుతుందని యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. స్టార్‌ మా ఈ సినిమా కు అంత భారీ మొత్తం ను పెట్టడం నిజంగా షాకింగ్‌ విషయం అంటున్నారు. ఈ వార్తలు కనుక నిజం అయితే బాలయ్య కెరీర్‌ లో బిగ్గెస్ట్‌ శాటిలైట్‌ రైట్స్ బిజినెస్ చేసిన సినిమా గా అఖండ నిలవడం ఖాయం అంటున్నారు.

అఖండ కు ప్రముఖ ఓటీటీ ఇప్పటికే భారీ మొత్తంలో రేటును ఆఫర్‌ చేసిందట. ప్రస్తుతానికి ఓటీటీ రైట్స్ ను హోల్డ్‌ లో పెట్టినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా బాలయ్య గత నాలుగు అయిదు సంవత్సరాల సినిమాలతో పోల్చితే ఈ సినిమా పై క్రేజ్‌ ఆకాశమే హద్దు అన్నట్లుగా ఉంది. ఈ సినిమా లో బాలయ్య లుక్‌ సినిమా పై అంచనాలు పీక్స్‌ కు వెళ్లేలా చేస్తున్నాయి. సింహా మరియు లెజెండ్‌ ల తరహాలో అఖండ కూడా బిగ్గెస్ట్‌ బ్లాక్ బస్టర్‌ సక్సెస్‌ ను అందుకుంటుందనే నమ్మకం ను ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.