Begin typing your search above and press return to search.
బ్యూటీ పార్లర్ వద్ద హీరోయిన్ పై కాల్పులు
By: Tupaki Desk | 16 Dec 2018 3:36 PM ISTహిందీలో జాన్ అబ్రహం హీరోగా తెరకెక్కిన ‘మద్రాస్ కేఫ్’ తోపాటు మోహన్ లాల్ హీరోగా వచ్చిన రెడ్ చిల్లీస్ సినిమాల్లో హీరోయిన్ గా చేసిన ప్రముఖ మలయాళ హీరోయిన్, మోడల్ లీనాపాల్ పై కాల్పులు జరిపారు. గుర్తు తెలియని వ్యక్తులు బైక్ పై వచ్చి ఆమె బ్యూటీపార్లర్ వద్ద ఉండగా కాల్పులు జరిపి పరారైనట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
పార్లర్ లో వేచి ఉన్న సమయంలో దుండగులు బయటి నుంచే ఎయిర్ గన్ తో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆమె తప్ప ఇంకా ఎవరూ గాయపడలేదు. ఆమె గాయపడగా ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు.ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉంది.
గతంలో లీనాపై పలు ప్రాంతాల్లో చీటింగ్ కేసులు నమోదయ్యాయి. 2013, 2015లో చీటింగ్ కేసుల్లో ఆమె అరెస్ట్ అయ్యి జైలు పాలై విడుదలైందని పోలీసులు తెలిపారు. ఆమె కాల్పులకు అండర్ వరల్డ్ తో ఉన్న ఆర్థికపరమైన విభేదాలే కారణమని పోలీసులు భావిస్తున్నారు.