Begin typing your search above and press return to search.

స్టార్‌ హీరో సినిమాలో మళ్లీ అవే సీన్స్‌..!

By:  Tupaki Desk   |   22 July 2022 11:30 PM GMT
స్టార్‌ హీరో సినిమాలో మళ్లీ అవే సీన్స్‌..!
X
తమిళ్‌ స్టార్‌ హీరో అజిత్ ప్రస్తుతం హెచ్ వినోద్ దర్శకత్వంలో ఒక సినిమా ను చేస్తున్నాడు. వీరిద్దరి కాంబోలో ఇప్పటికే పింక్‌ రీమేక్ నేర్కొండ పార్వై మరియు వలిమై సినిమాలు వచ్చాయి. రెండు సినిమాలు కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఆ రెండు సినిమా లను కూడా బాలీవుడ్‌ నిర్మాత బోనీ కపూర్‌ నిర్మించారు.

ప్రస్తుతం అజిత్‌.. వినోద్‌ ల కాంబోలో రూపొందుతున్న సినిమా ను కూడా బోనీ కపూర్‌ భారీ బడ్జెట్‌ తో రూపొందిస్తున్నారు. వలిమై సినిమా లో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉండటంతో బాలీవుడ్ ప్రేక్షకులు కూడా సినిమా ను ఆదరించారు. హిందీ డబ్బింగ్ వర్షన్ కు మంచి స్పందన రావడానికి ప్రధాన కారణం బైక్ ఛేజింగ్‌ సన్నివేశాలు మరియు భారీ యాక్షన్‌ సన్నివేశాలు.

వలిమై కి ఏమాత్రం తగ్గకుండా తాజా చిత్రంలో కూడా భారీ యాక్షన్‌ సన్నివేశాలుంటాయని తమిళ్ సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

హీరో అజిత్ కు బైక్ రైడింగ్.. చేజింగ్‌ సన్నివేశాలంటే చాలా ఆసక్తి. రిస్కీ షాట్స్ ను స్వయంగా అజిత్ చేసేందుకు రెడీ అన్నట్లుగా ముందే ఉంటారు. అలాంటి అజిత్ మళ్లీ అవే బైక్ ఛేజింగ్.. యాక్షన్‌ సన్నివేశాలను తాజా చిత్రంలో చూపించబోతున్నారట.

హాలీవుడ్ రేంజ్ యాక్షన్‌ సన్నివేశాలను.. బైక్ చేజింగ్‌ సన్నివేశాలను ఈ సినిమా లో దర్శకుడు హెచ్‌ వినోద్‌ ప్రేక్షకుల కు చూపించబోతున్నాడట. అజిత్ సినిమా అనగానే ఈ యాక్షన్‌ సన్నివేశాలే ఎక్కువ గుర్తుకు వస్తున్నాయి.. ఈ మధ్య కాలంలో ఆయన సినిమాల్లో గతంలో మాదిరిగా ఫ్యామిలీ ఎలిమెంట్స్ తగ్గిపోయాయి అంటూ అభిమానులు కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం చేస్తున్న సినిమా తర్వాత అయినా వేదాళం వంటి మరో ఫ్యామిలీ ఓరియంటెడ్‌ సినిమాను ఈయన చేస్తాడేమో అనే ఆసక్తితో అభిమానులు వెయిట్‌ చేస్తున్నారు. హెచ్ వినోద్‌ తో వరుసగా మూడవ సినిమా చేస్తున్న అజిత్ తదుపరి సినిమా ను అయినా వేరే దర్శకుడితో చేస్తాడేమో చూడాలి.