Begin typing your search above and press return to search.
మళ్ళీ బికినీ ఫోటోలకు బలై పోయింది
By: Tupaki Desk | 25 May 2018 2:05 PM GMTసోషల్ మీడియా దయవల్ల సెలెబ్రిటీలు ఈమధ్య ఫాన్స్ కు బాగా దగ్గరయ్యారు. ఎప్పటికప్పుడు ఫోటోలు షేర్ చేస్తూ, ఫాన్స్ కు అప్డేట్స్ ఇస్తూ ఉంటారు. కానీ సోషల్ మీడియా పుణ్యమా అని హేటర్లు కూడా సెలెబ్రెటీల మీద సెటైర్లు వేయడం మొదలెట్టారు. కొందరు పొగడ్తలతో ముంచెత్తుతారు మరికొందరు తిట్టిపోస్తారు. స్టార్లు మాత్రం ఏది పట్టించుకోరు అనుకోండి. ఈమధ్యనే అలా ఒక ఫోటో వల్ల నెటిజన్ల చేతిలో బలైన భామ మలైకా అరోరా.
నటిగా, డాన్సర్ గా, విజే గా తన ప్రతిభ చాటిన మలైకా బాలీవుడ్ లో అందరికీ సుపరిచితమే. సల్మాన్ ఖాన్ తమ్ముడు ఆర్బాజ్ ఖాన్ కు పెళ్లాడి గతేడాది విడిపోయిన మలైకాకి ఒక కొడుకు కూడా ఉన్నాడు. సోషల్ మీడియాలో బాగా యాక్టీవ్ గా ఉండే ఈమె ఇప్పుడు వెకేషన్ ఫోటోలతో ఫాన్స్ మనసుల్ని దోచేసుకుంటుంది. బికినీ వేసుకుని ఫోటోలకు ఏమాత్రం దాచుకోకుండా అందాల ఆరబోతతో కనువిందు చేస్తోంది. కొంతమంది ఆమె అందానికి ముగ్ధులై కామెంట్లు చేస్తోంటే కొందరు మాత్రం తిట్టిపోస్తున్నారు.
విడాకులు తీసుకుంది దీనికేనా ఒకళ్ళు ప్రశ్నిస్తుండగా మరొకరు ఒక 16 ఏళ్ల కొడుకు తల్లి అయ్యుండి ఈ పనులు ఏంటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు మాత్రం వయసుకు తగ్గ బట్టలు వేసుకో అంటూ సలహాలు కూడా ఇస్తున్నారు. మొత్తానికి వెకేషన్ ఫోటోలు కాస్తా ట్రోలర్ల చేతికి బాణాల్లా దొరికాయి అన్నమాట. అయినా ఇవన్నీ ఈ భామ పెద్దగా పట్టించుకోను అని ఎప్పుడు చెప్తూనే ఉంటుంది అనుకోండి.