Begin typing your search above and press return to search.

స‌ముద్ర గుహ‌లో చిక్కిన బికినీ మ‌త్స్యం

By:  Tupaki Desk   |   9 Sep 2022 4:42 AM GMT
స‌ముద్ర గుహ‌లో చిక్కిన బికినీ మ‌త్స్యం
X
పాన్ ఇండియా మూవీ 'లైగ‌ర్' తో సౌత్ కి ప‌రిచ‌య‌మైంది అన‌న్య పాండే. కానీ త‌న ఆశ‌లు అడియాస‌లే అయ్యాయి. మూవీ డిజాస్ట‌ర్ అవ్వ‌డంతో టాలీవుడ్ లో త‌న ఘ‌న‌మైన ఆరంగేట్రాన్ని చాటుకోవాల‌న్న కోరిక‌ ఫ‌లించ‌లేదు. అయితేనేం.. అన‌న్య‌కు అస్స‌లు టెన్ష‌న్ అన్న‌దే లేదు. అన్నిర‌కాల టెన్ష‌న్స్ నుంచి త‌న‌ను తాను బ‌య‌ట‌ప‌డేసేందుకు అలా విహార‌యాత్ర‌కు జంప్ అయిపోయింది. ప‌రాజ‌యాలతో నాకు ప‌నేంటి? అన్న‌ట్టుగానే ఉంది ఈ అమ్మ‌డి వ్య‌వ‌హారం.

కొంత‌కాలంగా అనన్య పాండే ఇటలీలో తన జాలీ లైఫ్ ని సెల‌బ్రేట్ చేస్తోంది. తన ఇన్ స్టా కుటుంబాన్ని హాలీడే స్పాట్ నుంచి అరుదైన‌ చిత్రాలతో అప్ డేట్ చేస్తోంది. గురువారం తన 'బోట్ డే'కి సంబంధించిన‌ కొన్ని ఫోటోలను షేర్ చేయ‌గా వైర‌ల్ అయ్యాయి.

ఈ ఫోటోతో పాటు.. జిందగీ నా మిలేగీ దొబారా చిత్రం నుండి లూప్ లో వింటున్న సూరజ్ కి బాహోన్ మే అనే పాటను వింటూ ప్ర‌తిదీ ఆస్వాధించాన‌ని చెప్ప‌డం మ‌రో కొస‌మెరుపు. బ్లూ గ్రోటోలో ఈదుకుంటూ వెళ్లి గుండె ఆకారంలో ఉన్న గుహను చూసాన‌ని కూడా అన‌న్య అభిమానులకు తెలియజేసింది.

అన‌న్య ఫ్లోర‌ల్ ప్రింట్ బీచ్ దుస్తులలో అందంగా కనిపించింది. అంద‌మైన‌ చెవిపోగులు నెక్లెస్ తో త‌న రూపాన్ని యాక్సెసరైజ్ చేసింది. ఈ పోస్ట్ ను షేర్ చేసిన వెంటనే త‌న‌ BFF సుహానా ఖాన్ వ్యాఖ్యల‌ విభాగంలో ఆమెకు ధన్యవాదాలు తెలిపారు. నేను మీతో ఇటలీలో ఉన్నట్లుగా ఉంది.. నాకు ధన్యవాదాలు అంటూ చిలిపిగా వ్యాఖ్యానించింది.

తల్లి భావన పాండే త‌న కుమార్తె అన‌న్య‌తో ప్రేమలో ఉన్నాన‌ని నిరూపించే ఎమోటికాన్ లను షేర్ చేసింది. అంతకుముందు అనన్య పాండే కొన్ని హాలిడే పోస్ట్ కార్డ్ లను షేర్ చేసి"దట్స్ అమోర్ (ప్రేమ)" అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ పోస్ట్ ను షేర్ చేసిన వెంటనే BFF షానాయ కపూర్ 'మిస్ uuu' అని వ్యాఖ్యానించింది.

ఇటలీకి బయలుదేరే ముందు అనన్య పాండే ఆయుష్మాన్ ఖురానాతో కలిసి 'డ్రీమ్ గర్ల్ 2' కోసం మధురలో షూటింగ్ చేసింది. త‌దుప‌రి వ‌రుస‌గా భారీ చిత్రాల్లో న‌టించేందుకు అన‌న్య సంత‌కాలు చేసింద‌ని స‌మాచారం. లైగ‌ర్ ఫ్లాపైంది కాబ‌ట్టి ఇప్ప‌ట్లో ద‌క్షిణాది వైపు చూసేందుకు ఆస్కారం లేద‌ని కూడా తెలుస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.