Begin typing your search above and press return to search.
లైంగిక వేధింపుల కేసు..ఆ నటుడికి పదేళ్ల జైలు
By: Tupaki Desk | 26 Sep 2018 2:38 PM GMTహాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా ప్రపంచవ్యాప్తంగా సినీ పరిశ్రమలో అమ్మాయిలపై లైంగిక వేధింపులకు సంబంధించి పెద్ద ఎత్తునే చర్చ నడుస్తోంది ఏడాదిగా. నిర్మాత హార్వీ వీన్ స్టీన్ బాగోతాల గురించి పదుల సంఖ్యలో అమ్మాయిలు ఆరోపణలు చేయడం తీవ్ర దుమారం రేపింది. ఐతే అతడి కంటే ముందు హాలీవుడ్లో తీవ్ర స్థాయిలో లైంగిక వేధింపుల ఆరోపణుల ఎదుర్కొన్న నటుడు బిల్ కాస్బీ. అతడిపై ఈ కేసులకు సంబంధించి 14 ఏళ్లుగా విచారణ నడుస్తుండటం గమనార్హం. ఇన్నేళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత 81 ఏళ్ల వయసులో బిల్ కాస్బీకి కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించడం విశేషం.
‘మి టు’ క్యాంపైన్ మొదలు పెట్టిన తర్వాత శిక్ష పడ్డ తొలి సెలబ్రిటీగా బిల్ కాస్పీ వార్తల్లోకి ఎక్కాడు. 2004లో ఆండ్రియా కాన్‌స్టాండ్ అనే నటికి మాదక ద్రవ్యాలు ఇచ్చి, ఆమెను శారీరకంగా వేధించినట్లు కాస్బీపై ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ కేసులో అతడు నిర్దోషిగా బయట పడ్డాడు. అదే కేసు వివిధ మలుపు తిరిగి ఎట్టకేలకు బిల్ కాస్పీకి శిక్ష పడేలా చేసింది. కాస్బీపై తర్వాతి కాలంలో మరిందరు మహిళలు ఆరోపణలు చేశారు. ఐతే తనపై ఆరోపణలు చేసిన వారంతా వారి ఇష్టపూర్వకంగానే తనతో శృంగారంలో పాల్గొన్నారంటూ బిల్ కాస్పీ వాదిస్తూ వచ్చాడు. ఐతే కాస్పీపై వచ్చిన లైంగిక ఆరోపణలు పరిశీలించిన మాంట్ గోమేరీ కౌంటీ జడ్జి అతడికి పదేళ్ల జైలు శిక్ష ఖరారు చేస్తూ తీర్పు ఇచ్చారు. అతడికి కాదు బెయిల్ ఇవ్వడానికి కూడా న్యాయ స్థానం నిరాకరించింది. టాలీవుడ్లో పలువురిపై లైంగిక వేధింపు ఆరోపణలు చేసిన శ్రీరెడ్డి.. బిల్ కాస్బీకి శిక్ష పడటంపై ఆనందం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టింది.