Begin typing your search above and press return to search.
బిగ్ బ్యాంగ్ థియరీ లో బిల్ గేట్స్..
By: Tupaki Desk | 22 Feb 2018 5:23 AM GMTదాదాపు అన్ని అమెరికన్ సిట్ కామ్స్ లోను ఎవరో ఒక ప్రముఖులు గెస్ట్ లు గా దర్శనమిస్తూనే ఉంటారు. మాములుగా కథ కు సంబందించొ లేదా అందుకో యాక్టర్స్ యొక్క లవర్స్ ఇలా సడన్ సర్ ప్రైజ్ లు ఇస్తూ ఉంటారు. కానీ బిగ్ బ్యాంగ్ థియరీ లో కనపడనున్న గెస్ట్ మాత్రం అందరికి నిజంగా సర్ ప్రైజ్ ఏ.
2007 లో మొదలైన బిగ్ బ్యాంగ్ థియరీ అనే ఒక అమెరికన్ టీవీ సిట్ కామ్ లో ప్రస్తుతం పదకొండవ సీజన్ నడుస్తోంది. ఇందులో మైక్రోసాఫ్ట్ ఫౌండర్ అయిన బిల్ గేట్స్ గెస్ట్ రోల్ లో కనపడనున్నారు. ఈ ఎపిసోడ్ మార్చి ఆఖరు లో ప్రసారం అవ్వబోతున్నట్టు సమాచారం. ఇందులో పెన్నీ అనే కారెక్టర్ బిల్ గేట్స్ కింద పని చేస్తూ ఉండగా ఆమె ఫ్రెండ్స్ అంతా ఆయన్ని కలవడానికి తిప్పలు పడతారు అనేదే ఎపిసోడ్ సారాంశం అని కొన్ని రూమర్లు చెబుతున్నాయి. బిల్ గేట్స్ ఇలా టీవీ షో లో రోల్ ప్లే చేయడం మొదటిసారి కాదు. ఇప్పటికే 2001 లో బిల్ గేట్స్ ప్రాసియర్ అనే ఒక సిట్ కామ్ లో నటించారు. కానీ సుమారు 17 ఏళ్ల తర్వాత మళ్లీ ఇలా టీవీ షో లో మెరవడం నిజంగా విశేషమే.
ఈ సిట్ కామ్ ఎక్కవగా ఫిసిక్స్ - టెక్నాలజీ గురించి నడుస్తూ ఉండటం వల్ల చాలా మంది ఆయా రంగాల్లో ప్రముఖుల్ని ఇలా గెస్ట్ రోల్స్ చేయడానికి ఆహ్వానిస్తూ ఉంటారు. ఇప్పటికే బజ్ ఆల్డ్రిన్ - ఏలోన్ మస్క్ - స్టీవ్ వస్నియాక్ - స్టీఫెన్ హాకింగ్ ఇలా చాలా మంది గెస్ట్ లాగా మెరిసారు. కానీ ఈసారి ఏకంగా బిల్ గేట్స్ ఏ కనిపించబోతున్నాడు అనడంతో ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఉన్నారు. అంత ప్రముఖ వ్యక్తి ని పెట్టాలంటే బోలెడంత రెమ్యునరేషన్ ఇవ్వలేమో అనుకునేరు. బిల్ గేట్స్ చిన్న పాత్రలే కాబట్టి అసలు డబ్బులు ఎం ఆశించరు అంట.