Begin typing your search above and press return to search.

ఆమెను రెండవ పెళ్లి చేసుకునేందుకు బిలియనీర్స్ క్యూ

By:  Tupaki Desk   |   26 May 2021 3:30 AM GMT
ఆమెను రెండవ పెళ్లి చేసుకునేందుకు బిలియనీర్స్ క్యూ
X
టీవీ స్టార్‌ కిమ్‌ కర్దాషియన్ భర్త కేన్‌ వెస్ట్‌ తో విడాకులు తీసుకోబోతుంది. ఆరు సంవత్సరాల వీరి వైవాహిక బంధంకు ఫుల్‌ స్టాప్‌ పెట్టబోతున్నట్లుగా ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. అంతే కాకుండా ఈ ఏడాది ఆరంభంలో విడాకుల కోసం కోర్టును కూడా ఇద్దరు ఆశ్రయించారు. ఇద్దరు ఒకరికి ఒకరు ఒప్పందంతో విడాకులు తీసుకోబోతున్నారు. వీరికి ఉన్న నలుగురు పిల్లల బాధ్యతలను కూడా సమానంగా పంచుకునేందుకు కోర్టు ముందు అంగీకారం తెలియజేశారు. వీరికి కోర్టు మరి కొన్ని వారాల్లోనే అధికారికంగా విడాకులు మంజూరు చేయబోతుంది.

విడాకులు మంజూరు అయిన వెంటనే మళ్లీ పెళ్లి చేసుకుంటాను అంటూ కిమ్‌ కర్దాషియన్‌ ఇప్పటికే ప్రకటించింది. దాంతో ఆమెతో జీవితంను పంచుకునేందుకు చాలా మంది ముందుకు వస్తున్నారు. హై ప్రొఫైల్ సెలబ్రెటీల నుండి మొదలుకుని పెద్ద ఎత్తున డబ్బు ఉన్న బిలియనీర్ల వరకు ఎంతో మంది ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. ఇప్పటికే ఆమె కు తమ ప్రపోజల్‌ ను తెలియజేస్తున్నారు. మరి కొందరు మాత్రం నేరుగా కాకుండా తమ ఆస్తిని ఆమె ముందు ప్రదర్శించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట.

ఇప్పటికే కిమ్‌ ప్రముఖ వ్యాపారవేత్తతో డేటింగ్‌ లో ఉందనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె ను దక్కించుకునేందుకు మరెంతో మంది ప్రయత్నాలు చేస్తున్నారు. అధికారికంగా విడాకులు వచ్చిన తర్వాత ఆమె ఎవరిని పెళ్లి చేసుకోబోతుంది అనేది అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈమెకు అంతర్జాతీయ గుర్తింపు ఉంది. అందుకే ఆమెను సొంతం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.