Begin typing your search above and press return to search.
బింబిసార 2... బాలయ్య ఉంటాడా?
By: Tupaki Desk | 15 Aug 2022 9:31 AM GMTనందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా వశిష్ఠ్ దర్శకత్వంలో రూపొంది ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న బింబిసార సినిమా కు సీక్వెల్ రాబోతుందని ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బింబిసార సినిమాకు సీక్వెల్ కాకుండా ప్రీక్వెల్ గా బింబిసార 2 రాబోతుందనే సమాచారం అందుతోంది.
బింబిసార సినిమా కు ముందు మెగా హీరో అల్లు శిరీష్ తో ఒక సినిమా ను గీతా ఆర్ట్స్ లో వశిష్ఠ్ చేయాల్సి ఉంది. కాని కొన్ని కారణాల వల్ల ఆ సినిమా క్యాన్సిల్ అయ్యింది. ఇప్పుడు మళ్లీ వశిష్ఠ్ తో ఆ సినిమాను చేయాలని గీతా ఆర్ట్స్ వర్గాల వారు భావిస్తున్నారట. కాని బింబిసార 2 కు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. ఏ సినిమా ముందు అవుతుందో చూడాలి.
మరో వైపు బింబిసార సినిమా ను చూసిన బాలకృష్ణ మాట్లాడుతూ వశిష్ఠ్ పనితనంపై ప్రశంసలు కురిపించాడు. ఇదే సమయంలో తప్పకుండా కలిసి సినిమా చేద్దామని కూడా హామీ ఇచ్చాడు. దాంతో ఇద్దరి కాంబోలో సినిమా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఒక వేళ బింబిసార సినిమా యొక్క రెండవ పార్ట్ లో మంచి పాత్ర ఉంటే తప్పకుండా బాలయ్య నటించే అవకాశం ఉంది.
కళ్యాణ్ రామ్ మరియు బాలయ్య లు కలిసి నటించాలని అభిమానులు కోరుకుంటున్నారు. కనుక బింబిసార 2 సినిమా ను ఖచ్చితంగా నందమూరి అభిమానుల కోసం ఫ్యామిలీ మల్టీస్టారర్ గా మారిస్తే బాగుంటుందనే అభిప్రాయం ను వ్యక్తం చేస్తున్నారు. బాలయ్య కు బింబిసార కాన్సెప్ట్ నచ్చింది. కనుక సీక్వెల్ లేదా ప్రీక్వెల్ లో నటించేందుకు ఎలాంటి అడ్డంకి చెప్పక పోచ్చు.
మొత్తానికి నందమూరి కళ్యాణ్ రామ్ బింబిసార చుట్టు ఆసక్తికర చర్చ జరుగుతోంది. రెండవ పార్ట్ కథ విషయంలో కూడా రకరకాలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. బింబిసార సినిమా లో బింబిసారుడు చనిపోయాడు కనుక అంతకు ముందు జరిగిన కథను చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా బింబిసార నిలిచింది. కనుక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బింబిసార 2 ను కూడా మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి.