Begin typing your search above and press return to search.

క్లాస్ కి క్లాస్... మాస్ కి మాస్..

By:  Tupaki Desk   |   4 Aug 2022 1:33 PM GMT
క్లాస్ కి క్లాస్... మాస్ కి మాస్..
X
తెలుగు ప్రేక్ష‌కుడికి స‌రికొత్త అనుభ‌వాన్ని ఈ వారం విడుద‌ల‌వుతున్న రెండు సినిమాలు అందించ‌బోతున్నాయి. అవే సీతా రామం, బింబిసార‌. ప్ర‌తీ వారం చాలా వ‌ర‌కు సినిమాలు రిలీజ్ అవుతుంటాయి కానీ భిన్న‌మైన జోన‌ర్ ల‌కు సంబంధించిన సినిమాలు ఒకే సారి బాక్సాఫీస్ వ‌ద్ద పోటీప‌డ‌టం చాలా అరుదు. ఇందులో ఒక‌టి ప‌క్కా క్లాస్ బొమ్మ‌.. మ‌రొక‌టి ప‌క్కా మాస్ బొమ్మ‌. ఈ రెండూ ఆగ‌స్టు 5న శుక్ర‌వారం థియేట‌ర్ల‌లోకి వ‌స్తున్నాయి.

నంద‌మూరి క‌ల్యాణ్ నామ్ న‌టించిన మూవీ `బింబిసార‌`. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో పీరియాడిక‌ల్ ఫిక్ష‌న‌ల్ మూవీగా ఈ సినిమాను రూపొందించారు. 5వ శ‌తాబ్దానికి చెందిన త్రిగ‌ర్త‌ల సామ్రాజ్యాధినేత బింబిసారుడు టైట‌మ్ ట్రావెల్ ద్వారా నేటి మోడ్ర‌న్ వ‌ర‌ల్డ్ లోకి ఎంట్రీ ఇస్తే ఏం జ‌రిగింది? అనే ఆస‌క్తిక‌ర‌మైన క‌థా, క‌థ‌నాల‌తో కంప్లీట్ గా ఈ మూవీ స‌గ‌టు ప్రేక్ష‌కుడికి స‌రికొత్త అనుభూతిని క‌లిగించ‌బోతోంది. మాస్ ప్రేక్ష‌కుల‌కు ఐ ఫీస్ట్ గా ఈ మూవీ వుండ‌బోతోందని టీజ‌ర్‌, ట్రైల‌ర్ లతో స్ప‌ష్టం అవుతోంది.

కొంత విరామం త‌రువాత క‌ల్యాణ్ రామ్ న‌టించిన సినిమా కావ‌డం.. బ‌డ్జెట్ కు వెన‌కాడకుండా భారీ స్థాయిలో విజువ‌ల్‌ గ్రాండియ‌ర్ గా నిర్మించిన తీరు, కల్యాణ్ రామ్ పాత్ర‌ని మ‌లిచిన విధానం మాస్ ఆడియ‌న్స్ విశేషంగా ఎట్రాక్ట్ చేస్తోంది. దీంతో సినిమాపై మంచి బ‌జ్ క్రియేట్ అయింది. ఓపెనింగ్స్ కూడా భారీగానే వుంటాయిన ట్రేడ్ వ‌ర్గాల్లో వినిపిస్తోంది.

ఇదే మూవీ విడుద‌ల‌వుతున్న రోజు క్లాస్ మూవీ `సీతా రామం` థియేట‌ర్ల‌లోకి వ‌స్తోంది. దుల్క‌ర్ స‌ల్మాన్, మృణాల్ ఠాకూర్ ల క‌ల‌యిక‌లో హ‌ను రాఘ‌వ‌పూడి రొమాటిక్ మ్యాజిక‌ల్ మూవీగా తెర‌కెక్కించాడు. ఇది కూడా ఫిక్ష‌న‌ల్ పీరియ‌డిక్ మూవీనే. అయితే బింబిసార‌`కు దీనికి తాజా వ్య‌త్యాసం వుంది. అది మాస్ మూవీ అయితే ఇది ప‌క్కా క్లాస్ బొమ్మ‌. వైజ‌యంతీ మూవీస్ భారీ నిర్మాణ విలువ‌ల‌తో ఓ క్లాసిక్ త‌ర‌హా మేకింగ్ తో ఈ మూవీని నిర్మించారు.

ఒకే రోజు బింబిసార‌, సీతారామం రిలీజ్ అవుతున్న పెద్ద‌గా క్లాష్ ఏమీ క‌నిపించ‌డం లేదు. కార‌ణం ఈ రెండు సినిమాలు భిన్న‌మైన జోన‌ర్ ల‌కు సంబంధించిన‌వి కావ‌డ‌మే. రెండు సినిమాల‌కు రెండు వ‌ర్గాల న్రేక్ష‌కులు వున్నారు. అయితే ఇక్క‌డో ప్ర‌మాదం వుంది... ఓ సినిమాకు అడ్వాంటేజీ వుంది.

ఫ‌స్ట్ షో టాక్ ని బ‌ట్టి మ‌రో సినిమా రైజ్ అయ్యే అవ‌కాశాలు మాత్రం ప్ర‌తీసారి ఎదుర‌వుతుంటాయ‌న్న‌ది తెలిసిందే. అలాగే ఈ రెండు సినిమాల్లో ఏ ఓక్క‌డి డౌన్ అయినా రెండ‌వది ఆటోమెటిగ్గా రైజ్ కావ‌డం గ్యారంటీ..దీంతో ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో టాక్ ఇప్ప‌డు ఈ రెండు సినిమాల‌కు అత్యంత కీల‌కంగా మారింది. చూద్దాం క్లాస్ గెలుస్తుందా? మ‌ఆస్ పై చేయి సాధిస్తుందా?