Begin typing your search above and press return to search.
'గాడ్ ఫాదర్' కోసం బింబిసార భామ..!
By: Tupaki Desk | 27 Sep 2022 7:36 AM GMTమెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం "గాడ్ ఫాదర్". ఇది మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్టైన 'లూసిఫర్' సినిమాకు అధికారిక తెలుగు రీమేక్ అనే సంగతి తెలిసిందే. కాకపోతే చిరు ఇమేజ్ - తెలుగు నేటివిటీ మరియు మెగా ఫ్యాన్స్ ని దృష్టిలో పెట్టుకొని తగినన్ని మార్పులు చేర్పులు చేశారు.
నిజానికి చిరంజీవి 'లూసిఫర్' చిత్రాన్ని రీమేక్ చేస్తున్నాడనే వార్త బయటకు వచ్చినప్పుడే.. ఈ ప్రాజెక్ట్ తెలుగులో వర్క్ అవుట్ అవుతుందా అనే కామెంట్స్ వచ్చాయి. దీనికి కారణం.. ఒరిజినల్ వెర్షన్ లో కథానాయకుడి పాత్రకు హీరోయిన్ ఉండదు.. పాటలకు అవకాశం లేదు. అందులోనూ హీరో మిడిల్ ఏజ్ లో రోల్ లో కనిపిస్తాడు.
ఇవన్నీ పరిగణలోకి తీసుకునే.. మెగాస్టార్ రేంజ్ కు ఈ పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంటుందో అని అందరూ ఆలోచించారు. దీనికి తోడు హీరోయిన్ లేకుండా చిరంజీవి నటించిన 'ఆచార్య' సినిమా డిజాస్టర్ గా నిలిచింది. దీంతో 'గాడ్ ఫాదర్' సినిమా ఎలా ఉంటుందో అని మెగా అభిమానులు కాస్త ఆందోళనకు గురయ్యారు.
అయితే ఇప్పటి వరకూ వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ ని బట్టి చూస్తే.. ఫ్యాన్స్ కోసం చాలానే చేంజెస్ చేసారనిపిస్తోంది. ఒరిజినల్ లో లేని విధంగా 'తార్ మార్ తక్కర్ మార్' వంటి పార్టీ సాంగ్ ని జత చేశారు. కానీ అది సినిమాలో సెట్ కాకపోవడంతో.. రోలింగ్ టైటిల్స్ లో వెయ్యాలని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో 'గాడ్ ఫాదర్' లో ఓ ఐటమ్ సాంగ్ ని పెట్టినట్లు సమాచారం. ఈ ప్రత్యేక గీతం కోసం స్పెషల్ సెట్ వేసి కోటిపైగానే ఖర్చు చేసారట. 'బింబిసార' సినిమాలో స్పెషల్ సాంగ్ లో ఆడిపాడిన వారినా హుస్సేన్.. 'గాడ్ ఫాదర్' ఐటెమ్ భామగా కనిపించనుందని టాక్.
ఇకపోతే ఈ ప్రత్యేక పాటలో చిరంజీవి భాగం అవుతాడు కానీ.. ఐటమ్ బ్యూటీతో కలిసి స్టెప్పులు వేసే అవకాశం లేదు. ఎందుకంటే ఇది విలన్ డెన్ లో వచ్చే పాట. చిరు ని కేవలం ఇంటర్ కట్స్ లో మాత్రమే చూపిస్తారని తెలుస్తోంది. వాస్తవానికి ఒరిజినల్ లోనూ 'రాఫ్తారా' అని స్పెషల్ సాంగ్ ఉంది. మరి తెలుగులో దీన్ని ఏవిధంగా చూపిస్తారో చూడాలి.
కాగా, 'గాడ్ ఫాదర్' సినిమాలో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కీలక పాత్ర పోషించారు. నయనతార - సత్యదేవ్ ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఎస్ఎస్ థమన్ సంగీతం సమకూర్చగా.. నీరవ్ షా సినిమాటోగ్రఫీ అందించనున్నారు. సురేష్ సెల్వరాజన్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరించారు.
దసరా సందర్భంగా అక్టోబర్ 5న గాడ్ ఫాదర్ విడుదల కాబోతోంది. ఇప్పటికే సెన్సార్ కూడా పూర్తయ్యింది. ఈ నేపథ్యంలో మేకర్స్ జోరుగా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇందులో భాగంగా రేపు అనంతపురంలోని జేఎన్టీయూ గ్రౌండ్స్ లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేశారు.
కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్ మరియు సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్స్ పై ఆర్‌బి చౌదరి - ఎన్‌వి ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలుగుతో పాటుగా హిందీ మరియు మలయాళ బాషల్లో 'గాడ్ ఫాదర్' సినిమాని విడుదల చేయనున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.