Begin typing your search above and press return to search.

'బింబిసార' 3వ రోజు కలెక్షన్స్‌

By:  Tupaki Desk   |   8 Aug 2022 6:27 AM GMT
బింబిసార 3వ రోజు కలెక్షన్స్‌
X
నందమూరి కళ్యాణ్ రామ్‌ బింబిసార సినిమా హిట్ టాక్ ను దక్కించుకోవడం తో పాటు భారీ వసూళ్లు నమోదు చేస్తుంది. ఈ మధ్య కాలంలో కొన్ని సినిమాలు టాక్ పాజిటివ్ గా దక్కించుకున్నా కూడా వసూళ్లు చాలా తక్కువగా ఉండేవి. కాని ఈ సినిమాకు మాత్రం మొదటి మూడు రోజులు సాలిడ్ వసూళ్లు నమోదు అయ్యాయి. మొదటి రోజు వసూళ్ల కు తగ్గకుండా శని మరియు ఆది వారాల్లో కూడా మంచి వసూళ్లు నమోదు అయ్యాయి.

ఏరియాల వారిగా మూడవ రోజు షేర్‌ ఇలా ఉన్నాయి.

నైజాం : 1.80 కోట్లు

వైజాగ్‌ : 72 లక్షలు

సీడెడ్ : 1.18 కోట్లు

కృష్ణ : 29 లక్షలు

గుంటూరు : 38 లక్షలు

నెల్లూరు : 13 లక్షలు

ఈస్ట్‌ : 32 లక్షలు

వెస్ట్‌ : 20 లక్షలు

మొత్తం మూడవ రోజు షేర్‌ 5.1 కోట్లు

ఏపీ మరియు తెలంగాణ లో మొదటి మూడు రోజుల్లో వచ్చిన మొత్తం షేర్‌ 15.9 కోట్ల రూపాయలు.

ఏపీ మరియు తెలంగాణలో ఈ సినిమా చేసిన ప్రీ రిలీజ్ బిజినెస్‌ దాదాపుగా 13 కోట్ల రూపాయలు.

మొదటి మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాట పట్టిన బింబిసార సినిమా నిర్మాతలకు మరియు బయ్యర్లకు భారీ లాభాలను తెచ్చి పెట్టబోతుందని ట్రేడ్‌ వర్గాల వారు అంటున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్‌ కెరీర్‌ లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా గా ఈ సినిమా నిలవబోతోంది.