Begin typing your search above and press return to search.
బింబిసార ఓటీటీ ఎప్పుడంటే: దిల్ రాజు వివరణ
By: Tupaki Desk | 8 Aug 2022 9:35 AM GMTకళ్యాణ్ రామ్ నటించిన ఫాంటసీ యాక్షన్ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా కేవలం చిత్ర యూనిట్ కు మాత్రమే కాకుండా టాలీవుడ్ చిత్ర పరిశ్రమ మొత్తం కూడా ఒక మంచి బూస్ట్ ఇచ్చింది అని చెప్పవచ్చు.
ఎందుకంటే జనాలు థియేటర్ లోకి రావడం లేదు అని ఎన్నో రకాల అనుమానాలు హైలెట్ అవుతున్న సమయంలో సరైన కంటెంట్తో వస్తే తప్పకుండా థియేటర్కు వస్తారు అని నిరూపించింది.
ఈ సినిమా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రోజురోజుకు పెరుగుతుంది ఉండడమే మొదటిరోజు అందుకు ఉదాహరణ. కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే అత్యధిక స్థాయిలో ఓపెనింగ్స్ అందుకొని రెండవ రోజు కలెక్షన్స్ తగ్గినప్పటికీ మూడవరోజు అంతకంటే ఎక్కువ స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టడం విశేషం. ఇటీవల కాలంలో ఏ సినిమా కూడా ఈ రేంజిలో నెంబర్లను పెంచుకోలేదు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఓటిటి విడుదల తేదీపై అనేక రకాల రూమర్స్ వైరల్ అవుతున్నాయి.
ముఖ్యంగా 4 వారాల్లోనే ఓటీటీ లో రావొచ్చునని కూడా జోరుగా వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయంలో నిర్మాత దిల్ రాజు ప్రత్యేకంగా ఒక ప్రకటన చేశారు.
ఇటీవల చిత్ర యూనిట్ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ఒక పార్టీ ఇచ్చిన దిల్ రాజు సినిమా 50 రోజుల తర్వాత గాని ఈ ఓటీటీ లో విడుదల చేసే అవకాశం లేదని తేల్చి చెప్పేశారు. దీంతో ప్రస్తుతం వైరల్ అవుతున్న రూమర్స్ అని కూడా అబద్ధం అని తేలిపోయింది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా దిల్ రాజు ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ హక్కులను కొనుగోలు చేసి భారీ స్థాయిలో విడుదల చేశారు. చిత్ర యూనిట్ సభ్యులు ఈ సినిమా ప్రమోషన్స్ కూడా బాగానే ఉపయోగపడ్డాయి. మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్స్ అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. మరి మొత్తంగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి లాభాలను అందుకుంటుందో చూడాలి.