Begin typing your search above and press return to search.

టాలీవుడ్ కి కొత్త మార్గం చూపించిన 'బింబిసార'

By:  Tupaki Desk   |   10 Aug 2022 4:30 PM GMT
టాలీవుడ్ కి కొత్త మార్గం చూపించిన బింబిసార
X
టాలీవుడ్ లో ఒక వైపు సినిమాలకు ఎంత బడ్జెట్‌ పెట్టినా సక్సెస్ దక్కడం లేదు.. బడ్జెట్‌ పెరిగి పోతున్నా కూడా వసూళ్లు మాత్రం నామమాత్రంగానే ఉంటున్నాయి అంటూ నిర్మాతలు సమ్మె చేస్తున్న విషయం తెల్సిందే. ఈ సమయంలో విడుదల అయిన సీతారామం మరియు బింబిసార సినిమాలు నిర్మాతల సమ్మెకు సమాధానం అన్నట్లుగా కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

సినిమా లో నటించిన నటీనటులు మరియు ఆ కథ యొక్క స్థాయిని బట్టి నిర్మిస్తే సినిమా యావరేజ్ గా ఆడినా కూడా బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశం ఉంది. ఇప్పుడు అదే విషయాన్ని ఈ రెండు సినిమా లు నిరూపించాయి.

అంతే కాకుండా ఈ రెండు సినిమాలు భారీ బడ్జెట్‌ లో కాకుండా సింపుల్ గా కూడా సినిమాలను ఎలా నిర్మించవచ్చు అంటూ మేకింగ్‌ పరంగా కొత్త మార్గంను చూపిస్తున్నాయి.

ముఖ్యంగా బింబిసార సినిమా కు వాడిన సెట్టింగ్‌ టెక్నాలజీ మరియు వీఎఫ్‌ఎక్స్ టెక్నాలజీ ముందు ముందు టాలీవుడ్‌ లో అత్యంత క్రియాశీలం అవ్వబోతుంది అంటున్నారు. బింబిసార సినిమాలో భారీ సెట్టింగ్స్ కనిపిస్తున్నాయి. అసలు విషయం ఏంటీ అంటే సెట్టింగ్స్ లో సగం వరకు నిర్మించడం.. లేదంటే గ్రాఫిక్స్ మాయాజాలంతో విజువల్‌ వండర్ గా సినిమాను మార్చారు.

సినిమాలోని వీఎఫ్‌ఎక్స్ వర్క్ కూడా కొత్త టెక్నాలజీతో చేసినట్లుగా సమాచారం అందుతోంది. అందుకే రాబోయే భారీ బడ్జెట్‌ సినిమాలు లేదా పీరియాడిక్ సినిమాలకు బింబిసార కోసం వాడిన టెక్నాలజీని వినియోగించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం రవితేజ హీరోగా రూపొందుతున్న టైగర్ నాగేశ్వరరావు సినిమాకు గాను బింబిసార యొక్క టెక్నాలజీని వాడేందుకు గాను ఆయా యూనిట్‌ సభ్యులతో చర్చలు జరుపుతున్నారు అంటూ సమాచారం అందుతోంది. మొత్తానికి బింబిసార టాలీవుడ్‌ కి ఒక కొత్త మార్గం ను చూపించిందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.