Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్: విజువల్ గ్రాండియర్ గా కళ్యాణ్ రామ్ 'బింబిసార'..!

By:  Tupaki Desk   |   4 July 2022 12:27 PM GMT
ట్రైలర్ టాక్: విజువల్ గ్రాండియర్ గా కళ్యాణ్ రామ్ బింబిసార..!
X
నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన సోషియో-ఫాంటసీ యాక్షన్ చిత్రం ''బింబిసార''. ‘ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్’ అనే ట్యాగ్ లైన్ తో రూపొందున్న ఈ సినిమాతో మల్లిడి వశిష్ఠ్ అనే నూతన దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు.

'బింబిసార' సినిమా నుంచి ఇప్పటి వరకు వచ్చిన ఫస్ట్ లుక్ మరియు టీజర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించాయి. జూలై 5న హీరో కళ్యాణ్ రామ్ పుట్టినరోజు కావడంతో.. ఈరోజు అద్భుతమైన ట్రైలర్ ను విడుదల చేసి చిత్ర బృందం సెలబ్రేషన్స్ మొదలు పెట్టారు.

'మనం ఎక్కడికి వెళ్తున్నాం నాన్నా?' అని ఓ బాలుడు ప్రశ్నించగా.. 'ఓ మహా చక్రవర్తి బింబిసారుడు ఏలిన రాజ్యానికి' అని తండ్రి చెప్పే వాయిస్ ఓవర్ తో 'బింబిసార' ట్రైలర్ ప్రారంభమైంది. ఇందులో కళ్యాణ్ రామ్ ద్విపాత్రాభినయంలో కనిపిస్తున్నారు.

ఒకరు చారిత్రక యుగంలో క్రూరమైన యోధునిగా కనిపిస్తే.. మరికొరు సమాజం కోసం పోరాడే ఆధునిక యువకుడిగా కనిపిస్తున్నారు. 'రాక్షసులు ఎరుగని రావణ రూపం.. శత్రువులు గెలవలేని కురుక్షేత్ర యుద్ధం.. తిగర్తల సామ్రాజ్యపు చక్రవర్తి బింబిసారుడి విశ్వరూపం..' అంటూ బింబిసారను కనిపించారు.

'ఇక్కడ రాక్షసుడైనా భగవంతుడైనా ఈ బింబిసారుడు ఒక్కడే' అని కళ్యాణ్ రామ్ చెప్పడంతో అతని పాత్ర ఎలా ఉంటుందో అర్థం అవుతుంది. రెండు వేర్వేరు టైమ్ లైన్ లో గతంలోనూ మరియు వర్తమానంలోనూ నడుస్తున్నట్లు సందేహాలు కలుగుతున్నాయి. అయితే ఈ రెండిటినీ ఎలా కనెక్ట్ చేసారనేది ఆసక్తికరం.

భారీ యాక్షన్ సన్నివేశాలు - ఆకట్టుకునే డైలాగ్స్ మరియు అద్భుతమైన వీఎప్ఎక్స్ వర్క్స్ తో విజువల్ వండర్ ఈ ట్రైలర్ ను కట్ చేశారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ దీనికి అదనపు ఆకర్షణగా నిలిచింది. బార్బేరియన్ కింగ్ బింబిసార మరియు మోడ్రన్ యువకుడిగానూ కళ్యాణ్ రామ్ ఆకట్టుకున్నాడు.

ఇందులో కేథరిన్ థ్రెసా - సంయుక్త మీనన్ వారీనా హుస్సేన్ కథానాయికలుగా నటించగా.. వెన్నెల కిషోర్ - బ్రహ్మాజీ - శ్రీనివాస రెడ్డి ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి చిరంతన్ భట్ సంగీతం సమకూర్చగా.., ఎంఎం కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. ఛోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ నిర్వహించారు.

'బింబిసార' ఇప్పటివరకు కళ్యాణ్ రామ్ కెరీర్లో అత్యంత భారీ బడ్జెట్ తో అత్యున్నత సాంకేతిక హంగులతో రూపొందించిన చిత్రం. ట్రైలర్ చూస్తుంటే మల్లిడి వశిష్ఠ్ ఎంతో అనుభవం ఉన్న దర్శకుడిగా ఈ చిత్రాన్ని ఆవిష్కరించారని చెప్పవచ్చు.

కళ్యాణ్ రామ్ సమర్పణలో నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ బ్యానర్ పై హరికృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. 'బింబిసార' చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా 2022 ఆగస్ట్ 5న భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.