Begin typing your search above and press return to search.

బెంగుళూరు డాన్ ఎంట్రీ మాములుగా లేదే

By:  Tupaki Desk   |   23 Aug 2021 2:30 PM GMT
బెంగుళూరు డాన్ ఎంట్రీ మాములుగా లేదే
X
బెంగుళూరు సిటీ మొట్టమొద‌టి డాన్ ఎంపీ జ‌య‌రాజ్ జీవిత‌క‌థ‌ ఆధారంగా క‌న్న‌డ భాష‌లో `హెడ్ బుష్` అనే చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. రెండు భాగాలుగా ఈ చిత్రం తెర‌కెక్క‌నుంది. ఇందులో `భైర‌వ‌గీత` ఫేమ్ ధ‌నుంజ‌య్ డాన్ పాత్ర‌ని పోషిస్తున్నారు. శూన్య ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమా ప్ర‌క‌టన నాటి నుంచి భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. డాన్ స్టోరీల‌కు ఉండే క్రేజ్ నేప‌థ్యంలో క‌న్న‌డ ప్రేక్ష‌కులు రిలీజ్ కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేప‌థ్యంలో అభిమానుల అంచ‌నాల్ని రెట్టింపు చేస్తూ హీరో జ‌న్మ‌దినోత్స‌వం సంద‌ర్భంగా టీజ‌ర్ ని రిలీజ్ చేసారు.

టీజ‌ర్ ఆద్యంతం ఆక‌ట్టుకుంది. టీజ‌ర్ ఆల్ ఇండియా రేడియో న్యూస్ బులిటెన్ తో ప్రారంభమ‌వుతుంది. బెంగుళూరు సిటీ డాన్ ఎంట్రీ టీజ‌ర్ లో అద‌ర‌గొట్టారు. డాన్ పాత్ర‌ని సినిమాలో ఓ రేంజ్ లో హైలైట్ చేస్తున్నార‌ని అర్థ‌మ‌వుతోంది. డాన్ గా కెరీర్ ముగించి రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్న స‌న్నివేశాన్ని టీజ‌ర్ లో చ‌క్క‌గా చూపించారు. జిందా బాద్ జిందా బాద్ అంటూ ఫాలోవ‌ర్స్ చేస్తోన్న హ‌డావుడి.. టీజ‌ర్ లో ఆర్.ఆర్.ఆర్ బాగున్నాయి. డాన్ నుంచి ఎంపీగా మారిన త‌ర్వాత క‌థ‌ని సినిమాలో హైలైట్ చేస్తారా? లేక డాన్ స్టోరీపై ద‌ర్శ‌కుడు ఎక్కువ‌గా ఫోక‌స్ చేస్తున్నారా? అన్న‌ది చూడాలి.

ఇందులో పంజాబీ బ్యూటీ పాయ‌ల్ రాజ్ పుత్ డాన్ గాళ్ల్ ప్రెండ్ పాత్ర‌లో న‌టిస్తుంది. పాయ‌ల్ పాత్ర‌కు చాలా ప్రాముఖ్య‌త ఉంటుంది. డాన్ పాత్ర చాలా మంది గాళ్ ప్రెండ్స్ ఉంటారు. కానీ పాయ‌ల్ మొద‌టి గాళ్ ప్రెండ్ పాత్ర‌లో మెయిన్ లీడ్ లో క‌నిపించ‌నుంది. ఈ చిత్రాన్ని ద‌క్షిణాదిన అన్ని భాష‌ల్లో రిలీజ్ చేయ‌బోతున్నారు. తెలుగులో కూడా పెద్ద ఎత్తున రిలీజ్ కానుంది.