Begin typing your search above and press return to search.
అగ్గి రాజేస్తున్న మోదీ బయోపిక్
By: Tupaki Desk | 16 March 2019 5:58 AM GMTఎన్నికల వేళ ప్రధాని నరేంద్ర మోదీ బయోపిక్ వేడెక్కిస్తోంది. ఎన్టీఆర్ బయోపిక్, వైయస్సార్ బయోపిక్, థాక్రే, మన్మోహన్ బయోపిక్ ల తరహాలోనే దేశవ్యాప్తంగా చర్చల్లోకి వచ్చిన బయోపిక్ ఇది. బాలీవుడ్ స్టార్ హీరో వివేక్ ఒబేరాయ్ ప్రధాన పాత్ర లో ఒమంగ్ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ బయోపిక్ 23 భాషల్లో రిలీజవుతోంది. ఇప్పటికే అన్ని భాషల పోస్టర్లను మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ బయోపిక్ ని లోక్ సభ ఎన్నికల ముందు రిలీజ్ చేస్తున్నారా? అంటే... అలాంటిదేమీ లేదని - ఎన్నికల తర్వాతనే రిలీజ్ చేస్తున్నామని దర్శకనిర్మాతలు ప్రకటించారు. ఏప్రిల్ 12న ఈ చిత్రం రిలీజవుతుందని నిర్మాత సందీప్ ఎస్.సింగ్ అధికారికంగానే వెల్లడించారు. దాదాపు 120 కోట్ల మంది (1.3 బిలియన్) భారతీయులకు మోదీ జీవితకథను చూపించబోతున్నామని నిర్మాత తెలిపారు.
ఓవైపు బయోపిక్ తెరకెక్కుతుండగానే.. మరోవైపు ప్రధాని మోదీపై వెబ్ సిరీస్ తీస్తున్నామంటూ వేడి పెంచేస్తున్నారు. పీఎం నరేంద్ర మోదీపై 10 భాగాల వెబ్ సిరీస్ ని ప్రారంభించనున్నారు. `ఓ మై గాడ్` - `102 నాట్ ఔట్` చిత్రాల దర్శకుడు ఉమేష్ శుక్లా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ వెబ్ సిరీస్ కి సంబంధించిన పోస్టర్ ని లాంచ్ చేశారు. ఏప్రిల్ 2019 నుంచి ఈరోస్ నవ్ లో ప్రీమియర్లకు రంగం సిద్ధమవుతోందని ప్రఖ్యాత క్రిటిక్ తరణ్ ఆదర్శ్ వెల్లడించారు.
ఒకేసారి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి.. దివంగత నాయకురాలు జయలలిత జీవితంపై మూడు సినిమాలు తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అలాగే ఎన్టీఆర్ పై రెండు భాగాల సినిమా రిలీజైంది. ఆర్జీవీ `లక్ష్మీస్ ఎన్టీఆర్` పేరుతో మూడో సినిమా రిలీజవుతోంది. ఇప్పుడు ప్రధాని మోదీపైనా సినిమాలు - వెబ్ సిరీస్ లు అంటూ వాతావరణం వేడెక్కిపోతోంది. మరోవైపు రజనీకాంత్ లాంటి ప్రముఖుడిపైనా బయోపిక్ లు - వెబ్ సిరీస్ లు తెరకెక్కేందుకు ఆస్కారం లేకపోలేదన్న వాదనా వినిపిస్తోంది. ఓవరాల్ గా ఎండల మంటతో పాటు బయోపిక్ ల మంట అంతకంతకు పెరుగుతోందే కానీ తగ్గడం లేదు!!