Begin typing your search above and press return to search.

బ‌యోపిక్ వివాదం: స‌త్య రామ‌లింగ‌రాజు త‌ర్వాత బిగ్ బిపై కోర్టు స్టే!

By:  Tupaki Desk   |   20 Sep 2020 4:45 AM GMT
బ‌యోపిక్ వివాదం: స‌త్య రామ‌లింగ‌రాజు త‌ర్వాత బిగ్ బిపై కోర్టు స్టే!
X
ఇటీవ‌ల ఓటీటీ వేదిక‌ల‌పై రిలీజ‌వుతున్న సినిమాలు భారీగానే వివాదాల్ని మోసుకొస్తున్నాయి. కంటెంట్ ప‌రంగా సెన్సార్ కంట్రోల్ అనేది లేక‌పోవ‌డంతో ఈ వేదిక‌పై ఆడిందే ఆట పాడిందే పాట‌గా మారింది. అయినా కొన్నిటిని కోర్టులు విచారిస్తూ స్టేలు విధిస్తుండ‌డంతో వాటి రాక ఆగ‌మ్య‌గోచ‌రంగా మారుతోంది. ఇటీవ‌ల నెట్ ఫ్లిక్స్ లాంటి స్ట్రీమింగ్ సంస్థ‌లు ఈ త‌ర‌హా వివాదాల్లో న‌లుగుతుండ‌డం చూస్తున్న‌దే. స‌త్యం రామ‌లింగ‌రాజు జీవిత‌క‌థ ఆయ‌న జీవితంతో ముడిప‌డిన ఇత‌రుల క‌థ‌ల్ని డాక్యు సిరీస్ గా రూపొందించి రిలీజ్ చేయాల‌నుకున్న నెట్ ఫ్లిక్స్ కి కోర్టు ముకుతాడు వేసింది. రామ‌లింగ‌రాజు కోర్టుల ప‌రిధిలో దీనిపై పోరాడుతున్నారు. ప్ర‌స్తుతం కోర్టు విచార‌ణ సాగుతోంది.

ఇక ఇదే త‌ర‌హాలో బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ న‌టించిన ఝుండ్ వివాదాస్ప‌ద‌మైంది. స్పోర్ట్స్ డ్రామా `ఝుండ్‌`ను డిజిటల్ ప్లాట్ ఫామ్ లేదా సినిమాహాళ్ళలో విడుదల చేయడాన్ని నిషేధిస్తూ కుకట్‌పల్లి సెషన్స్ కోర్టు ఆర్డ‌ర్ జారీ చేసింది. ముంబై మురికివాడల నేప‌థ్యంలో ఫుట్ బాల్ కోచ్ అఖిలేష్ పాల్ జీవితం ఆధారంగా రూపొందించిన బ‌యోపిక్ చిత్ర‌మిది. నాగరాజ్ మంజులే దర్శకత్వం వ‌హించారు.

అయితే ఇదే క‌థ‌పై తాను హ‌క్కులు క‌లిగి ఉన్నానంటూ హైదరాబాద్ కు చెందిన ఔత్సాహిక చిత్రనిర్మాత నంది చిన్ని కుమార్ కోర్టును ఆశ్రయించారు. అఖిలేష్ పాల్ జీవితం ఆధారంగా ఒక సినిమా తీయడానికి తనకు ప్రత్యేకమైన హక్కులు ఉన్నాయని `స్లమ్ సాకర్` పేరుతో సినిమా తీస్తున్నాన‌ని ఆయ‌న కోర్టులో వాదించారు. ఆయ‌న వాద‌న నెగ్గింది. అతను ఝుండ్ దర్శకుడు స‌హా నిర్మాతపై ఆయ‌న కేసు పెట్టాడు. అతని పిటిషన్ విన్న తరువాత ఝుండ్ విడుదలపై కోర్టు నిషేధ ఉత్తర్వులు జారీ చేసింది.