Begin typing your search above and press return to search.
తెలంగాణ గాంధీపై బయోపిక్
By: Tupaki Desk | 29 April 2016 2:14 PM GMTతెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సృష్టించిన చరిత్ర చిన్నదేం కాదు. తెలంగాణ సాధనలో ఆయన కానీ, ఆయన స్థాపించిన టీఆర్ఎస్ పాత్రకానీ చాలా ముఖ్యం. అందుకే కేసీఆర్ సాగించిన ప్రస్థానంపైనే ఓ సినిమా తీయాలనే ఆలోచన గత రెండేళ్ల నుంచి నానుతోంది.
తెలంగాణకు చెందిన కొందరు రచయితలు.. కేసీఆర్ బయోపిక్ కి సంబంధించిన స్క్రిప్ట్ పనులను సీరియస్ గానే తీసుకున్నారు. ఇప్పుడది దాదాపు పూర్తి కావచ్చిందని తెలుస్తోంది. పలు పార్టీల్లో కేసీఆర్ భాగస్వామ్యం, ఆ తర్వాతి పరిస్థితులు - సొంత పార్టీ స్థాపన - తెలంగాణ ఉద్యమం.. చివరకు రాష్ట్రసాధనతో ముఖ్యమంత్రి పీఠం.. ఇదీ సినిమా ఇతివృత్తం. కేసీఆర్ యాంగిల్ లోనే తీసుకుంటే హీరోయిజం ఎలివేట్ అవుతుందనే ఉద్దేశ్యంతో.. ఈ బయోపిక్ ను రాసుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సరైన దర్శకుడి కోసం అన్వేషణ జరుగుతోంది.
ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఆంద్రకు చెందిన పలవురు దిగ్గజ దర్శకులు.. ఈ మూవీని హ్యాండిల్ చేసేందుకు ఉత్సాహం చూపించడమే. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే మరో నెల రోజుల్లోనే కేసీఆర్ బయోపిక్ తెరకెక్కించే ప్రణాళిక ప్రారంభమవుతుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దినమైన జూన్ 2న కేసీఆర్ బయోపిక్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని టాక్.