Begin typing your search above and press return to search.

దేవినేని బ‌యోపిక్` వంగ‌వీటికి పోటీనా?

By:  Tupaki Desk   |   24 April 2019 11:53 AM GMT
దేవినేని బ‌యోపిక్` వంగ‌వీటికి పోటీనా?
X
బెజ‌వాడ రాజ‌కీయాల్లో రెండు పేర్లు ప్ర‌ముఖంగా వినిపిస్తాయి. అందులో ఒక‌టి వంగ‌వీటి రంగా.. ఇంకొక‌టి దేవినేని నెహ్రూ. పొలిటిక‌ల్ వార్ లో ఒక‌రితో ఒక‌రు పోటీప‌డిన నాయ‌కులుగా ఆ ఇద్ద‌రి పేరు చ‌రిత్ర‌కెక్కింది. నాటి రాజ‌కీయాల్లో ప్ర‌భావ‌వంత‌మైన నాయ‌కులుగా ఇరువురి మ‌ధ్యా ఘ‌ర్ష‌ణ గురించి ప్ర‌త్యేకంగా చెబుతారు. ఆ ఇద్ద‌రి కోణంలో బెజ‌వాడ రాజ‌కీయాల్ని ప‌రిశీలిస్తే ఆస‌క్తిక‌ర విష‌యాలెన్నో స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతాయి. కాంగ్రెస్- తేదేపా మ‌ధ్య వార్ .. బెజ‌వాడ రాజ‌కీయాల‌కు ఉన్న చ‌రిత్ర ఎంతో ఉద్విగ్న‌భ‌రిత‌మైన‌ది. అయితే వంగ‌వీటి జీవితంపై ఆర్జీవీ సినిమా తీశారు కానీ.. దేవినేని నెహ్రూపై సినిమా తీయ‌లేదు. ప్ర‌స్తుతం ఆ బ్లాంక్ ని ఫిల్ చేసేందుకా అన్న‌ట్టు `దేవినేని బ‌యోపిక్` అంటూ మ‌రో కొత్త ట్ర‌య‌ల్‌ ఆస‌క్తి రేపుతోంది.

దేవినేని గా తార‌క‌ర‌త్న న‌టిస్తుండ‌డం మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన ఎలిమెంట్. నంద‌మూరి తారకరత్న కథానాయకుడిగా దేవినేని నెహ్రూ బయోపిక్ నేడు ప్రారంభమైంది. `దేవినేని` అనే టైటిల్ ని ఫిక్స్ చేసి.. `బెజవాడ సింహం` అన్న ట్యాగ్ లైన్ ఇచ్చారు. ఈ సినిమాకు నర్రా శివ నాగేశ్వరరావు (శివ నాగు) ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఆర్.టి.ఆర్ ఫిలింస్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు రాము రాథోడ్ నిర్మాత. ప్రసాద్ ల్యాబ్స్ లో చిత్రం ప్రారంభ‌మైంది. ప్ర‌ముఖ నిర్మాత సి.క‌ళ్యాణ్ క్లాప్ కొట్టి, సీనియ‌ర్ ఆర్టిస్ట్ జ‌మున కెమెరాస్విచాన్ చేయ‌గా సీనియ‌ర్ పాత్రికేయులు వినాయ‌క‌రావుగారు ఫ‌స్ట్ షాట్‌కి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

దేవినేని మ‌ర‌ణానంత‌రం ఈ బ‌యోపిక్ ని తెర‌కెక్కిస్తుండ‌డం ఆస‌క్తిక‌రం. ఇక‌పోతే రాజ‌కీయాల్లో ఆయ‌న వార‌సుడు దేవినేని అవినాష్ ప్ర‌స్తుతం జోరుమీద ఉన్నారు. ఈ నేప‌థ్య ంలో పెద్దాయ‌న బ‌యోపిక్ అంటూ వివాదాల్ని కెలుకుతున్నారా? అంటూ తెలుగు సినీమీడియాలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. అయితే దేవినేని చేసిన మంచి ప‌నుల‌ను చూపించేందుకు ఈ సినిమాని తీస్తున్నామ‌ని ద‌ర్శ‌కుడు చెబుతున్నారు. బెజ‌వాడ రాజ‌కీయాల్లో కొంద‌రిని క‌లిసి క‌థ రాసుకున్నార‌ట‌. మే 10నుంచి రెగుల‌ర్ షూటింగ్ జ‌రుగుతుంది. ద‌స‌రాకి విడుద‌ల చేయాల‌న్న‌ది ప్లాన్‌. ఈ క‌థ 1977లో సాగే కథాంశ‌మ‌ని చెబుతున్నారు. సింగిల్ షెడ్యూల్‌లో షూటింగ్ పూర్తి చేస్తార‌ట‌. హీరో తార‌క్ మాట్లాడుతూ... మా ఫ్యామిలీకి ఎంతో స‌న్నిహితులైన వ్య‌క్తి దేవినేని. పెద‌నాన్న‌గారిలాంటివారు. ఆయ‌న పాత్ర పోషించ‌డం చాలా ఆనందంగా ఉంద‌ని అన్నారు.