Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: హానీమూన్ పై మోజుపోలే

By:  Tupaki Desk   |   24 July 2017 6:18 AM GMT
ఫోటో స్టోరి: హానీమూన్ పై మోజుపోలే
X
బాలీవుడ్ లో ఇప్పుడు ప్రేమ పక్షులు రాను రాను ఎక్కువై పోతున్నారు. కొన్ని సినిమాలు కలిసిన చేసినవారు ప్రేమ లో పడి మళ్ళీ విడిపోవాటాలు కూడా పెరిగాయి. ఇప్పుడు బాలీవుడ్ అంతా ఒక ప్రేమ జంటను చూసి అసూయ పడిపోతుంది. ఆ హీరోయిన్ తొలి ప్రేమ వికటించినా ఇప్పుడు ప్రేమ పెళ్లి చేసుకొని చక్కగా తన బందాన్ని బలపడేలా మార్చుకుంది.

బాలీవుడ్ సెక్సీ భామ బిపాషా బసు తన సహ నటుడు కరణ్ సింగ్ గ్రోవర్ ను పెళ్లి చేసుకొని చాల కాలం అయినా వీళ్ళ కు ఇంకా హానీమూన్ పై మోజు పోయినట్లు లేదు. ఎప్పుడు ఏ చిన్న అవకాశం వచ్చిన ఇద్దరు విహారాలకు వెళ్ళి బీచ్ లోనో లేక అక్కడ హోటల్లోనే ఒక రొమాంటిక్ పిక్చర్ ఒకటి తీసుకొని సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తారు. వీళ్ళ ప్రేమ చూడటానికి కూడ సోషల్ మీడియాలో అభిమానులు తెగ ఆరాటపడిపోతుంటారు. ఇప్పుడు కూడా IIFA అవార్డ్ షో కోసం న్యూ యార్క్ వెళ్ళి పని పూర్తి కాగానే అటు నుండి అటే ఒక టూర్ వేసుకున్నారు. ఇక్కడ ఫోటో చూడండి మీకే అర్ధం అవుతుంది వీళ్ళు ఎటు వంటి ప్రేమ పక్షులో. ఇద్దరు ఒకరి ప్రేమ కోసం ఒకరు పరితపిస్తూ ముద్దులుతో వాళ్ళ ప్రేమను బలపరుచుకొంటున్నారు. కరణ్ సింగ్ తన పెదాలు తో బిపాసా పేదలును తాకి వాళ్ళ ప్రేమ ను తెలియపరుస్తున్నారు మనకు. మురల్ అనే ఆర్ట్ వర్క్ కోసం వీళ్ళు ఇలా తమ పెదాలతో ముద్దు ఫోజ్ ఇచ్చారు.

ముద్దులు ముచ్చట్లు వీళ్ళు ఈ మధ్య బాగానే చేసుకుంటున్నారు. ఎక్కడకి వెళ్ళినా వాళ్ళ ప్రేమకు గుర్తుగా మనకు ఇటువంటి ఒక ఫోటో కూడా పంపుతున్నారు. నాకు జీవితంలో సరిపడినంత ప్రేమ ఒక మనిషి రూపంలో దొరికింది అని నన్ను ఇంతలా ప్రేమించే మనిషితో నేను కలిసి బతకడం నాకు చాల సంతోషంగా ఉంది అని చెబుతుంది ఈ బాలీవుడ్ సెక్స్ బాంబ్.​