Begin typing your search above and press return to search.

పెళ్లయినా క్లీవేజ్ షోలు మానేది లేదు

By:  Tupaki Desk   |   4 Aug 2016 10:16 AM GMT
పెళ్లయినా క్లీవేజ్ షోలు మానేది లేదు
X
పెళ్లికి ముందు హీరోయిన్లు ఎలా కనిపించినా.. ఎన్ని వేషాలేసినా.. పెళ్లి తర్వాత మాత్రం పద్ధతిగా మారిపోతుంటారు. సంప్రదాయబద్ధంగానే కనిపిస్తుంటారు. కనీసం గ్లామర్ డోస్ అయినా తగ్గిస్తారు. ఐతే బిపాసా బసుకు మాత్రం ఇలాంటి హద్దులేమీ ఉన్నట్లు లేవు. పెళ్లికి ముందు ఎలా రెచ్చిపోయేదో.. ఇప్పుడు కూడా అలాగే చెలరేగిపోతోంది. బికినీ అందాలతో.. క్లీవేజ్ షోలతో కుర్రాళ్లలో ఇప్పటికీ సెగలు రేపడానికే ప్రయత్నిస్తోందామె.

ఆ మధ్య భర్త కరణ్ వీర్ సింగ్ గ్రోవర్ తో కలిసి హనీమూన్ ట్రిప్పులో ఎలాంటి హాట్ హాట్ ఫొటోలు పెట్టిందో గుర్తుండే ఉంటుంది. తమ బెడ్ రూం దృశ్యాలు.. బీచ్ లో బికినీ అందాలతో ఫొటోలు షేర్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది బిప్స్. తాజాగా ఇండొనేషియాలోని బాలిలో తన భర్తతో కలిసి షికారు చేసి వచ్చిన బిపాసా.. అక్కడ బికినీ వేసుకుని క్లీవేజ్ షోలు చేస్తూ దిగిన సెల్ఫీల్ని జనాలతో పంచుకుంది. పెళ్లికి ముందే అంతో ఇంతో మేలేమో అనిపిస్తోంది బిపాసా హాట్ హాట్ ఫోజులు చూస్తే. ఎంతైనా కరణ్ కు ఇది మూడో పెళ్లి. బిపాసాకు అతను ఎలాంటి షరతులు పెడుతున్నట్లు లేడు. అందుకే అమ్మడు ఇలా రెచ్చిపోతున్నట్లుంది.