Begin typing your search above and press return to search.
బిపాషాకి ఆ పేపర్ పై మండిపోయింది
By: Tupaki Desk | 12 April 2016 4:57 AM GMTబిపాషా బసు ఇప్పుడు పెళ్లి కూతురు అవుతోంది. టీవీ యాక్టర్ కరణ్ సింగ్ గ్రోవర్ ను పెళ్లి చేసుకుంటున్నట్లు చెప్పింది. కొన్నేళ్లుగా ఒకరినొకరు ఇష్టపడుతున్న వీరిద్దరు.. పెళ్లి విషయాన్ని ఓ ప్రెస్ నోట్ ద్వారా అందరికీ తెలియచెప్పారు.
కానీ తన మ్యారేజ్ విషయాన్ని బిప్స్ అనౌన్స్ చేసే లోగానే.. ప్రియాంక చోప్రా లీక్ చేసేసింది. ట్విట్టర్ లో కంగ్రాట్యులేషన్స్ చెబుతూ ప్రియాంక చోప్రా చేసిన ట్వీట్ తో... కరణ్ సింగ్ -బిపాషాల పెళ్లి సంగతి అందరికీ తెలిసిపోయింది. ఆ తర్వాతే బిపాషా నుంచి మీడియాకి ప్రెస్ నోట్ వచ్చింది. ఇలా తన పెళ్లి విషయాన్ని తనకంటే ముందే చెప్పేయడంతో.. ప్రియాంక చోప్రాపై బిపాషా తెగ సీరియస్ అయిందంటూ.. ఓ హైద్రాబాద్ బేస్డ్ ఇంగ్లీష్ డైలీ న్యూస్ రాసింది.
దీంతో బిప్స్ కి మంట నషాళానికి అంటింది. 'నిజానిజాలు తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్లు రాసేయడం ఈ పేపర్ వాళ్లకు బాగా అలవాటైపోయింది. నాకు ఎప్పటినుంచో ప్రియాంక మంచి ఫ్రెండ్. తనపై నాకు కోపం ఎందుకొస్తుంది? ఏదైనా రాసేముందు నిజాలు తెలుసుకోండి' అంటూ సీరియస్ గానే క్లాస్ పీకేసింది కొత్త పెళ్లి కూతురు బిపాషా బసు.