Begin typing your search above and press return to search.

పెళ్లి పై మళ్లీ పజిల్ విసిరేసిందే

By:  Tupaki Desk   |   1 April 2016 1:30 AM GMT
పెళ్లి పై మళ్లీ పజిల్ విసిరేసిందే
X
బాలీవుడ్ బ్యూటీ బిపాషా బసు పెళ్లి అంటూ కొంతకాలంగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఏప్రిల్ 30 న కరణ్ సింగ్ గ్రోవర్ ను పెళ్లి చేసుకునేందుకు బిపాషా సిద్ధమైపోయిందనే రూమర్స్ ఉన్నాయి. దీని మీద క్లారిటీ అడిగితే మాత్రం కన్ఫ్యూజ్ చేసేస్తోంది బిప్స్.

రీసెంట్ గా ఓ వాచ్ షోరూంను ఓపెన్ చేసేందుకు నోయిడాలోని ఓ మాల్ కు వచ్చింది బిపాషా. అక్కడ ఈమెకు పెళ్లి గురించి ప్రశ్న ఎదురైంది. అప్పుడీ బాలీవుడ్ బ్యూటీ 'పెళ్లి జరిగితే అప్పుడు మీకే కాదు ప్రజలందరికీ తెలుస్తుందిగా' అంటూ ఆన్సర్ ఇచ్చి అక్కడి నుంచి తుర్రుమంది బిప్స్. మరో నెలరోజుల్లో పెళ్లి అనగా బిపాషా ఇచ్చిన ఈ ఆన్సర్ అక్కడున్న గందరగోళంలో పడేసింది.

వాస్తవంగా అయితే గతంలో జాన్ అబ్రహాంతో డేటింగ్ చేసిన బిపాషా.. కరణ్ సింగ్ తో డేటింగ్ చేస్తోందనే టాక్ ఉంది. చాలా కాలం డేటింగ్, ఔటింగ్ చేసి పెళ్లికి ఫిక్స్ అయిపోయారనే టాక్ వస్తే.. ఇప్పుడు ఎటూ తేల్చకుండా.. అటూ ఇటూ కానీ ఆన్సర్ ఇచ్చింది బిపాషా. 'జరిగితే తెలుస్తుంది' అన్న బిప్స్ మాటకు.. జరుగుతుందని అర్ధమా లేక.. మీరంతా అనుకుంటే జరిగిపోతుందా అని మీనింగా అని మాత్రం క్లారిటీ రాలేదు. షికార్లు కొట్టడంలో ఉన్న క్లారిటీ... పెళ్లి గురించి అనౌన్స్ చేసేటప్పుడు మాత్రం ఎందుకు ఉండదో అర్ధం కాని విషయమే.