Begin typing your search above and press return to search.

బెంగాలీ స్టైల్లో బిపాసా బేబి షోవ‌ర్ వేడుక

By:  Tupaki Desk   |   10 Sep 2022 4:38 AM GMT
బెంగాలీ స్టైల్లో బిపాసా బేబి షోవ‌ర్ వేడుక
X
బెంగాలీ బ్యూటీ బిపాసా బ‌సు టాలీవుడ్ లో 'ట‌క్క‌రి దొంగ' చిత్రంలో న‌టించిన సంగ‌తి తెలిసిందే. సూప‌ర్ స్టార్ మ‌హేష్ స‌ర‌స‌న ఈ బ్యూటీ ఘ‌న‌మైన ఆరంగేట్రం చేసినా ఆ త‌ర్వాత తెలుగు సినిమాల‌కు క‌మిట‌వ్వ‌లేదు. పూర్తిగా బాలీవుడ్ కే అంకిత‌మైంది.

ఇక బిపాసా నిరంత‌రం ప్రేమాయణాల‌తో హెడ్ లైన్స్ లో నిలిచింది. ఆరంభం మోడ‌ల్ కం న‌టుడు డినో మారియోతో డేటింగ్ చేసిన బిప్స్ ఆ త‌ర్వాత అత‌డికి బ్రేకప్ చెప్పి సింహ‌బ‌లుడు జాన్ అబ్ర‌హాంతో సుదీర్ఘ కాలం ప్రేమాయ‌ణం సాగించింది. కానీ ఆ ఇద్ద‌రి మ‌ధ్యా బాండింగ్ కి బ్రేక్ ప‌డింది. ఆ త‌ర్వాత టీవీ న‌టుడు నిర్మాత క‌ర‌ణ్ సింగ్ గ్రోవ‌ర్ తో కొన్నేళ్ల ప్రేమాయ‌ణం అనంత‌రం అత‌డిని పెళ్లాడింది.

ఇప్పుడు బిపాసా బసు- కరణ్ సింగ్ గ్రోవర్ జంట‌ తమ మొదటి బిడ్డను స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ జంట 2016 లో వివాహం చ‌సుకున్నారు. ఇటీవ‌లే గర్భధారణ ప్రకటన త‌మ‌ అభిమానులకు సంతోషాన్ని కలిగించింది. స్టార్ క‌పుల్ తమ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా తమ అభిమానులను అప్ డేట్ చేస్తున్నారు. ఇటీవల కాబోయే తల్లిదండ్రులు బేబీ షవర్ వేడుక జ‌రిగింది. దీని నుంచి కొన్ని ఫోటోల‌ను కూడా ఈ జంట తాజాగా షేర్ చేసారు.

కాబోయే మామ్ బిపాసా బ‌సు ఈ ఫోటోల్లో ఎంతో తేజోవంతంగా కనిపించింది. అంద‌మైన రెడ్ శారీ విప్పార్చిన క‌ళ్ల‌తో క‌నిపించింది. త‌న వారు త‌న‌కు న‌చ్చే ఆహారాన్ని నోటికందిస్తుండ‌గా.. బెంగాలీ బేబీ షవర్ సంప్రదాయబ‌ద్ధంగా సాగింది. బెంగాలీల్లో గర్భం దాల్చిన ఏడవ నెల పూర్తయిన తర్వాత షాద్ (బెంగాలీ బేబీ షవర్) నిర్వహిస్తారు. కాబోయే తల్లి అవసరాలు కోరికలు ఈ వేడుక‌లో తీరుస్తారు.

తాజాగా షేర్ చేసిన ఫోటోల్లో బిపాసా తన తల్లితో క‌లిసి పోజులిచ్చింది. ఈ పోస్ట్ కు క్యాప్షన్ ఇస్తూ .. మీలాంటి 'మా' అవ్వాలని కోరుకుంటున్నాను అని బిపాసా వ్యాఖ్య‌ను జోడించింది. ఇంతలో బిపాసా బసు తన భర్త .. కాబోయే తండ్రి కరణ్ సింగ్ గ్రోవర్ తో ఉన్న ఫోటోలను కూడా షేర్ చేసింది. వీటిలో కరణ్ తెల్లటి సాంప్రదాయ దుస్తులలో అందంగా కనిపించాడు. ఫోటోలలో ఈ జంట చిరునవ్వులు చిందిస్తూ ఆనందంగా కెమెరాకు పోజులిచ్చారు.

ఆగస్ట్ 2022లో తమ మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్నామని బిపాసా-క‌ర‌ణ్ జంట‌ ప్రకటించారు. బిపాషా తన బేబీ బంప్ ను ఆలింగనం చేసుకున్న ఫోటో షూట్ తో గర్భవతి అయిన వార్తను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫోటోలో తెల్లటి చొక్కా ధరించి బిపాసా చాలా అందంగా కనిపించింది. త‌న భ‌ర్త‌ కరణ్ బేబీ బంప్ ను ముద్దాడుతూ క‌నిపించాడు. బిపాసా-క‌ర‌ణ్ జంట కొన్ని టీవీ షోల‌ను నిర్మించ‌డ‌మే గాక సినీనిర్మాణ రంగంలోనూ కొన‌సాగుతున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.