Begin typing your search above and press return to search.

లెస్బియన్‌ వెంబడించింది బాబోయ్‌!!

By:  Tupaki Desk   |   17 July 2015 7:39 PM GMT
లెస్బియన్‌ వెంబడించింది బాబోయ్‌!!
X
నల్లకలువ బిపాసబసు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకించి పరిచయం చేయనక్కర్లేదు. చాక్లెట్‌బోయ్‌ మహేష్‌ సరసన 'టక్కరిదొంగ' సినిమాలో నటించి తెలుగు యువత మనసు దోచింది. సినిమా ఫ్లాపైనా మనసు దొంగ అనిపించుకుంది. అటుపై 'ధూమ్‌ -2' అనువాద చిత్రంలో బికినీ బిజిలీగా మైమరిపించింది. సోగదేహంతో మతుల్‌ సుతుల్‌ తప్పేలా చేసింది. ఆ తర్వాత యోగా సీడీ అంటూ ఆల్మోస్ట్‌ వయ్యారాల వడ్డనలతో బోలెడంత సీడీల బిజినెస్‌ చేసింది. అయితే ఈ అమ్మడి జీవితంలో ఒకానొక సందర్భం ఎప్పటికీ వీడనిది అని చెప్పుకొచ్చింది.

ఒకానొక పార్టీలో ఓ లెస్బియన్‌ నా దగ్గరికి వచ్చి ఓ ఖరీదైన వజ్రాల హారాన్ని కానుకగా ఇవ్వజూసింది. అంతేనా ఏడుపు మొహంతో బరస్ట్‌ అయ్యి నన్ను తనివితీరా తాకాలని చూసింది. ఆ సంఘటనకు నిర్ఘాంతపోయాను. ఒళ్లంతా తేళ్లు జెర్రెళ్లు పాకినట్టు అయిపోయింది. బాబోయ్‌ అని భయపడి బిక్క చచ్చిపోయాను.. అంటూ ఆ ఘోరమైన అనుభవాన్ని చెప్పుకొచ్చింది. బిప్స్‌ ఆ టైమ్‌లో ఒంటరిగా దొరికి ఉంటే ఏమయ్యేదో ఓ మారు ఊహించుకోండి.