Begin typing your search above and press return to search.

ఆమె వలనే నేను సన్నబడాల్సి వచ్చింది

By:  Tupaki Desk   |   13 Oct 2016 7:30 AM GMT
ఆమె వలనే నేను సన్నబడాల్సి వచ్చింది
X
సోనమ్ కపూర్ బాగా ఓపెన్. నోరు తెరిచి చెప్పడం మొదలు పెట్టాలి కానీ.. అసలు అమ్మడి నోట్లో సీక్రెట్ అనేదే దాగదు. తాను బయటకు వచ్చే ముందు... ఇలా అందంగా కనిపించడం కోసం.. అర డజన్ మంది గంటన్నరపాటు తయారు చేస్తారని చెప్పగల డేరింగ్ వేరే ఎవరికీ ఉండదు. అలాంటి ఈ బ్యూటీ.. నేహ ధూపియా నిర్వహిస్తున్న 'నో ఫిల్టర్ నేహ' కార్యక్రమానికి వచ్చేసింది.

సెలబ్రిటీలు తమ నోటికి వేసుకునే ఫిల్టర్లను తీసేసి మాట్లాడాలన్నది ఈ ప్రోగ్రాం రూల్. మరి ఇలాంటి షోలో సోనమ్ చెప్పిన మాటలు వింటే కెవ్వ్ మనాల్సిందే. 'అప్పట్లో బిపాషా బసు నేను కలిసి ఒక మూవీ చేస్తున్నాం. అప్పుడు తను బికినీతో ఆ ఏరియా అంతా నడిచేస్తోంది. నేను కూడా ఇలా సన్నగా అయిపోవాలని తెగ అనుకునేదాన్ని. అప్పుడు వెళ్లి తననే సన్నగా ఉండడం గురించి అడిగేశాను. అప్పుడు జీఎం డైట్ ప్లాన్ గురించి చెప్పింది. వారం పాటు అనుసరించాల్సి ఈ డైట్ ప్లాన్ నా లైఫ్ లో బోలెడన్ని ఛేంజెస్ తీసుకొచ్చింది' అంటోంది సోనమ్ కపూర్.

సినిమాల విషయంలో సలహాలు ఇస్తే సోనమ్ కి బాగా మండుతుందట. నీరజ సినిమా సక్సెస్ జోష్ లో ఇంకా ఈమె కొనసాగుతోంది కానీ.. అలాంటి సినిమా వద్దని చెప్పారట. ధనుష్ తో చేసిన రాన్ ఝానా విషయంలో కూడా ఇలాంటి సలహాలు చాలానే వచ్చాయట. కాకపోతే హాట్ చిక్ కేరక్టర్లు చేసిచేసి విసుగొచ్చేసి రాన్ ఝానా చేశానంటోంది సోనమ్ కపూర్.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/