Begin typing your search above and press return to search.

సంవత్సరమైంది.. పెద్ద విషయమేనట..

By:  Tupaki Desk   |   27 April 2017 12:28 PM GMT
సంవత్సరమైంది.. పెద్ద విషయమేనట..
X
సోషల్ మీడియాలో స్టార్ ఫాలోయింగ్ ఎలా ఉంటుందో మీకు తెలిసిందే. అందుకే సెలబ్రిటీలు అందరూ తన సంబరాలను అభిమానులుతో ఈ మీడియా ద్వారా పంచుకోవడానికి తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ప్రేమ విషయాల నుండి కుటుంబంలో జరిగే ఏ శుభకార్యం ఐనా ఒక ఫోటోతోనో మెసేజ్ తోనో ఒక వీడియోతోనో ఆనందం పంచుకొంటున్నారు. అదిగో ఈ బ్యూటి కూడా అలాగే చేసింది.

బాలీవుడ్ సెక్స్ బాంబ్ గా పేరు మోసిన బిపాషా బసు.. టివి సీరియల్ నటుడు కరణ్ సింగ్ గ్రోవర్ తో పెళ్ళయి ఇవాల్టికి ఒక సంవత్సరం పూర్తయ్యింది. ఫస్ట్ యానివర్సరీ సందర్బంగా తన సోషల్ మీడియా పేజీలో బిపాసా ఒక వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియో నిడివి చిన్నదే అయినా.. తన ప్రేమను ఆమె భర్తకు (అభిమానులకు కూడా) తెలిసేలా ఒక చూపు చూసి.. కొన్ని ఉద్వేగ క్షణాలు తో కలగలిపి కొన్ని ఆనందభాష్పాలతో ముగించింది. ''మా ప్రేమకు ఒక ఏడాది చాలా తొందరగా గడిచింది ఇది నా జీవితం లో మరిచిపోలేని రోజు అని చెప్పుతూ మా పెళ్ళికి అసలైన పునాది స్నేహం. అందుకే ఎటువంటి అపోహలుకు చోటులేకుండా సాగింది మా బంధం'' అని చెప్పుకొచ్చింది అమ్మడు.

గతంలో ఏళ్ళ తరబడి జాన్ అబ్రహం వంటి హీరోలను డేటింగ్ చేసిన బిపాసా.. ఇప్పటికే రెండుసార్లు పెళ్లి చేసుకుని డైవర్స్ తీసుకున్న కరణ్‌ సింగ్ గ్రోవర్ తో అసలు ఒక సంవత్సరం గడిపిందంటే పెద్ద విషయమే అంటూ నెటిజన్లు సైటైర్లు కూడా వేస్తున్నారులే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/