Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: మైండ్ బ్లోయింగ్ బిపాషా

By:  Tupaki Desk   |   24 Nov 2017 7:31 AM GMT
ఫోటో స్టోరి: మైండ్ బ్లోయింగ్ బిపాషా
X
బాలీవుడ్ డస్కీ బ్యూటీ బిపాషా బసు ఈ మధ్య కాలంలో సినిమాల్లో కనిపించడం మానేసింది. గతేడాది పెళ్లి చేసుకున్న భామకు.. అక్కడ నుంచి సిల్వర్ స్క్రీన్ పై మెరవనే లేదు. అలాగని ఈమెకు ఏమీ నటనకు స్వస్తి పలకాలనే ఆలోచనలు లేవు. కానీ అవకాశాలు ఆమె చెంతకు చేరడం లేదంతే.

పెళ్లి చేసుకున్న తర్వాత ఛాన్సులు రావడం కాసింత కష్టమే. కానీ బాలీవుడ్ లో అలాంటి పట్టింపులు అంతగా ఉండవు. కానీ ఆశ్చర్యకరంగా బిపాషాను మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదు. అయితే జనాలు తనను మరిచిపోకుండా ఉండడానికి ఏం చేయాలో బిపాషాకు బాగానే తెలుసు. అందుకే సోషల్ మీడియాలో తన గ్లామరస్ ఫోటోలను తెగ షేర్ చేసేస్తూ ఉంటుంది. రీసెంట్ గా గోవా వెళ్లిన ఈ భామ.. అక్కడ స్విమ్మింగ్ చేస్తూ ఓ పిక్ తీయించుకుని నెట్ లో పెట్టేసింది. ప్రేమలోని లోతులను చూస్తున్నానంటూ కేప్షన్ పెట్టింది . టాప్ యాంగిల్ లోంచి తీసిన ఈ ఫోటో చూస్తే మైండ్ బ్లోయింగ్ అనాల్సిందే మరి.

ఈ మధ్య కాలంలో తన భర్తతో కలిసి ఓ కండోమ్ యాడ్ లో కూడా హాట్ హాట్ గా కనిపించింది బిపాషా. అయినా.. తనకు అవకాశాలు ఇవ్వమని.. ఇస్తే ఏ రేంజ్ అందాలను అయినా ఆరబోసేందుకు రెడీ అని.. ఇంతకంటే ఎవరైనా ఎలా చెబ్తారు చెప్పండి? మరి బిపాషా బసు ఇస్తున్న సిగ్నల్స్ ను అర్ధం చేసుకుని ఆమెకు మళ్లీ సినిమాల్లో ఛాన్స్ ఇచ్చే వారెవరో?