Begin typing your search above and press return to search.
కిక్కిచ్చిన పిట్ట కథ
By: Tupaki Desk | 21 Aug 2015 10:43 AM GMTఅత్తారింటికి దారేది, లెజెండ్ వంటి హిట్ సినిమాల్లో పిట్ట కథలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అవి బాగా క్లిక్కవ్వడంతో తర్వాత వచ్చిన మరికొన్ని సినిమాల్లోనూ అలాంటి పిట్ట కథలను వినిపించే ప్రయత్నం చేశారు. కొంతమందైతే ఏకంగా స్పూఫ్ చేసి మరీ సొమ్ము చేసుకోవాలనుకున్నారు. కానీ అవేవీ అంత కిక్కివ్వలేదు.
ఈ రోజు విడుదలైన కిక్కు 2 సినిమాలో మరో పిట్ట కథ మళ్ళీ అలా ఆసక్తిగా కనపడింది. అయితే ఇది గత సినిమాల మాదిరి హీరో విలన్ ని బెదిరిస్తూ సాగేది మాత్రం కాదు. కథలో పిట్ట (పావురం) ఓ పాత్ర అన్నమాట. సినిమా ఆరంభంలో విలన్ తన సామ్రాజ్యాన్ని ఎలా సృష్టించుకున్నానో చెప్పే సన్నివేశంలో ఆయన ఇంటి గోడ మీద వున్న పావురాల జంటలో ఒక పావురాన్ని చంపి తన క్రూరత్వాన్ని చూపిస్తాడు. బతికున్న పావురం ఎంతో బాధపడుతూ వుంటుంది. సినిమాలోని విలన్ కి సంబంధించిన ప్రతి సన్నివేశంలోనూ ఈ పావురం స్క్రీన్ పై కనపడుతుంది. సినిమా చివర్ లో విలన్ వల్ల బాధపడిన గ్రామస్తులు విలన్ ని ప్రాణాలతో వదిలేస్తే అతన్ని చంపేది ఈ పావురమే. అదీ ఈ పిట్ట (పావురం) కథ. ఇదేదో జీవహింస అని కోర్టుకెక్కేరు. అంతా ఉత్తిదే... గ్రాఫిక్స్ అన్నమాట.