Begin typing your search above and press return to search.
యాక్షన్ కింగ్ లో అదే సత్తా!
By: Tupaki Desk | 15 Aug 2018 5:31 AM GMTయాక్షన్ కింగ్ అర్జున్ అనగానే గుర్తొచ్చే తొలి సినిమా `జెంటిల్ మేన్`. కెరీర్ రెండో దశలో అర్జున్ లైఫ్ ని కీలక మలుపు తిప్పిన సినిమా ఇది. ది గ్రేట్ శంకర్ ఈ చిత్రంతోనే దర్శకుడిగా పరిచయం అయ్యారు. జెంటిల్ మేన్ అటు తమిళ్ - ఇటు తెలుగులో పెద్ద హిట్. ఆ చిత్రం రాబిన్ హుడ్ తరహా. డబ్బున్న వాళ్లను దోచుకుని పేద విద్యార్థుల చదువుల కోసం, మంచి పనుల కోసం ఉపయోగించడం అన్నది సినిమా కాన్సెప్ట్. ఓ పేద విద్యార్థి మెడిసిన్ చదవాలన్న కోరిక నెరవేరక ఆత్మహత్య చేసుకోవడం కథానాయకుడు అర్జున్ ని దొంగగా మారేలా చేస్తుంది. ఆ తర్వాత దోపిడీలు - పోలీస్ చరణ్ రాజ్ వెంటాడడం షరా మామూలే. అర్జున్ లోని పూర్తి యాక్షన్ స్టైల్ ని ఎలివేట్ చేసిన చిత్రమిది. అంతకుముందు కరాటే ఫైటర్ గా అర్జున్ పలు చిత్రాల్లో భారీ మాస్ ఫైట్స్ చేసినా `జెంటిల్ మేన్` చిత్రంతో అతడికి గొప్ప పేరొచ్చింది. కెరీర్ పరంగా మరో మెట్టు పైకి ఎక్కాడు. ఆ తర్వాత శంకర్ దర్శకత్వంలోనే అతడు నటించిన `ఒకే ఒక్కడు` బ్లాక్ బస్టర్ హిట్. ఒక్క రోజు సీఎం పాత్రలో అర్జున్ కుమ్మి పడేశాడు. ఇప్పటికీ `ఒకే ఒక్కడు` బుల్లితెరపై టాప్ టీఆర్ పీ మూవీగా నిలుస్తోందంటే ఆ సినిమాలో కంటెంట్ - అర్జున్ యాక్షన్ - అందులో పెర్ఫెక్షన్ అనే చెప్పాలి.
అర్జున్ లోని నాటి పెర్ఫెక్షనిజం ఇప్పటికీ అలానే ఉంది. ఆ సంగతిని రీసెంటుగా రిలీజైన లై - అభిమన్యుడు చిత్రాలు నిరూపించాయి. ఈ సినిమాల్లో అర్జున్ హీరోగా నటించకపోయినా అతడే హీరోలా కనిపిస్తాడు. హీరోకి ధీటైన క్లాస్ విలనీతో అదరగొట్టేశాడు. పాతికేళ్ల వయసు కుర్రాడు పెర్ ఫెక్ట్ టోన్డ్ బాడీతో ఎలా నిగనిగలాడతాడో 50ఏళ్ల అర్జున్ ఆ తీరుగానే దేహదారుడ్యాన్ని మెయింటెయిన్ చేయడం ఓ బిగ్ సర్ ప్రైజ్. కన్నడ హీరోగా మొదలై - అటుపై తొలి తెలుగు సినిమా `మా పల్లెలో గోపాలుడు`లో రాణీ రాణమ్మ... అంటూ సందడి చేసిన అర్జున్ నాటి రూపం ఇంకా అభిమానుల కళ్లలోనే ఉంది. `జైహింద్`లో దేశభక్తుడైన అర్జున్ ని ఎవరూ మర్చిపోలేదు. `శ్రీఆంజనేయం`లో ఆంజనేయుడిని అభినయించిన అర్జున్ ని - `హనుమాన్ జంక్షన్` అర్జున్ ని అంత తేలిగ్గా మర్చిపోలేం.
అర్జున్ ఇప్పటికీ బిజీ స్టార్. ప్రస్తుతం కన్నడ - తమిళంలో వరుసగా సినిమాలు చేస్తున్నాడు. కాంట్రాక్ట్ అనే తెలుగు చిత్రంలో నటిస్తున్నాడు. ఇరువార్ ఒప్పతమ్ (తమిళ్) - కోలైకారన్ - కురుక్షేత్ర (కన్నడ) చిత్రాల్లో నటిస్తున్నాడు. నేడు యాక్షన్ కింగ్ అర్జన్ బర్త్ డే. తమిళ్ - తెలుగులో అతడి అభిమానులు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. హ్యాపి బర్త్ డే టు అర్జున్.