Begin typing your search above and press return to search.
మళ్లీ మళ్లీ బంతాడేస్తావా డార్లింగ్!
By: Tupaki Desk | 23 Oct 2018 4:42 AM GMT100కోట్ల క్లబ్ కే తికాణా లేని మనకు 500కోట్ల క్లబ్ - 1000కోట్ల క్లబ్ - 1500కోట్ల క్లబ్ - 2000 కోట్ల క్లబ్ అంటూ కొత్త క్లబ్బుల్ని.. ఎవరూ ఊహించని క్లబ్బుల్ని పరిచయం చేసింది బాహుబలి సిరీస్. ఈ సిరీస్ గొప్పతనంలో తెర వెనక పని చేసిన ఎస్.ఎస్.రాజమౌళి- ఆర్కా టీమ్ కి ఎంత క్రెడిట్ దక్కుతుందో.. తెరపై కనిపించిన ప్రభాస్ కి అంతే క్రెడిట్ దక్కుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. బాహుబలి అనే ఒక గొప్ప మహారాజు కథను వెండితెరపై మహదాద్భుతంగా చూపించాలి అని వెతికినప్పుడు .. వెతకబోయిన తీగలా ప్రభాస్ తగిలాడు జక్కన్నకు. అది ప్రభాస్ కాకుండా వేరొకరు అయితే సూటయ్యేవారా? అన్న ప్రశ్న తలెత్తింది. ఆరున్నర అడుగుల ఆజానుబాహుడు - కత్తి దూసి కర్రసాము చేసేవాడు తెలుగు సినీపరిశ్రమలో వేరొకరు ఎవరున్నారు? రెబల్ స్టార్ కృష్ణంరాజు తర్వాత! స్వతహాగానే ఆ రాజసం ప్రభాస్ రాజులో కనిపించింది కాబట్టే ఆ పాత్రకు ఎంచుకున్నారు రాజమౌళి. జక్కన్న విజన్ ని వందశాతం తెరపై ఆవిష్కరించడానికి ప్రభాస్ తీరైన రూపం.. నటనా కౌశలం.. అంతకుమించి కత్తి తిప్పడంలో రాజసం.. రాకుమారితో, అవంతికతో రొమాన్స్.. అన్నీ అద్భుతంగా కుదిరాయి.
అందుకే బాహుబలి సిరీస్ అంతటి సంచలనాలకు ఆలవాలం అయ్యిందంటే అతిశయోక్తి కాదు. ఒక్క బాహుబలి సిరీస్ అన్ని సినీపరిశ్రమలకు ఎన్నో పాఠాల్ని నేర్పింది. ముఖ్యంగా బాలీవుడ్ సైతం చూసి నేర్చుకోవాలి అన్నంతగా పాఠం నేర్పింది. అసలు అప్పటివరకూ ప్రభాస్ ఇమేజ్ - క్రేజు కేవలం తెలుగు రాష్ట్రాల వరకే. ఆ ఒక్క సినిమాతో అన్ని పరిశ్రమలకు డార్లింగ్ క్లోజ్ అయిపోయాడు. తన మార్కెట్ పరిధిని అమాంతం పెంచుకున్నాడు. 100 కోట్లు కాదు.. 1000 కోట్లు అంతకుమించి అని ప్రూవ్ చేశాడు. అందుకే అదే కాన్ఫిడెన్స్ తో ప్రస్తుతం `సాహో` లాంటి భారీ యాక్షన్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా మార్కెట్ బాహుబలికి తక్కువేం కాదని ప్రూవ్ చేయాలన్నది అతడి తపన. అందుకే యూవీ క్రియేషన్స్ తో కలిసి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు. వందల కోట్లు వెచ్చించి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇదో భారీ యాక్షన్ చిత్రం. ఫాంటసీతో కూడుకున్నది కావడంతో అందరిలోనూ ఒకటే ఉత్కంఠ నెలకొంది. వచ్చే సమ్మర్ కి సిసలైన విజువల్ ఫెస్టివల్ ని ప్రభాస్ బృందం సిద్ధం చేస్తున్నారు. బాహుబలితో పరిమితం కాదు - బాహుబలిని మించి అని నిరూపించాల్సిన సందర్భం ప్రభాస్ ముందు ఉంది. ఇదో సవాల్ అనే చెప్పాలి. నేడు రిలీజ్ చేస్తున్న `సాహో` మేకింగ్ విజువల్స్ తో వీళ్ల సత్తా ఎంతో, విజన్ ఎంతో మరోసారి క్లారిటీ వస్తుంది.
ఈ సినిమాతో పాటు రాధాకృష్ణ దర్శకత్వంలో చేస్తున్న ప్రేమకథా చిత్రం షారూక్ డీడీఎల్ జే రేంజులో సత్తా చాటితేనే డార్లింగ్ క్రేజు మరింతగా విస్తరిస్తుంది. ఇండస్ట్రీలో అందరినీ డార్లింగ్ అని సంభోధిస్తూ మృధు స్వభావిగా - మితభాషిగా మంచి పేరు తెచ్చుకున్న ప్రభాస్ అదే క్రమశిక్షణతో మంచితనంతో అన్ని పరిశ్రమల్ని తనలో కలిపేసుకుంటూ ముందుకు దూసుకుపోతున్నాడు. బాహుబలితో ప్రపంచవ్యాప్తంగా 2000కోట్లు (జపాన్ వసూళ్లు కలుపుకుని) వసూలు చేశాడు. ఇప్పుడు `సాహో`తో అంతకుమించి మ్యాజిక్ చేస్తాడనే ఆశిద్దాం. మళ్లీ మళ్లీ బాక్సాఫీస్ ని బంతాడేస్తేనే ఇక్కడ క్రేజు నిలబడుతుంది. మునుముందు డార్లింగ్ కెరీర్ పరంగా ఎలాంటి రికార్డులు నెలకొల్పబోతున్నాడు? అన్నది ఇప్పటికి సస్పెన్స్. నేడు ప్రభాస్ రాజు పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు.