Begin typing your search above and press return to search.
బిత్తిరి సత్తి కామెంట్స్ పై హంగామా
By: Tupaki Desk | 3 Feb 2019 11:39 AM GMTవివాదం సృష్టించాలనుకుంటే ఏ విషయంపైనైనా వివాదం సృష్టించొచ్చు. కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టన్నమాట. రీసెంట్ గా బిత్తిరి సత్తి కామెంట్స్ విషయంలో అలానే జరిగింది. 'దిక్సూచి' అనే సినిమా ఈవెంట్లో యాంకర్ శ్రీముఖి డ్రెస్ గురించి మాట్లాడుతూ "నువ్వు పద్ధతి.. సాంప్రదాయం గల దుస్తుల్లోకి రావు.. రాలేవు" అన్నాడు. దీనికి సమాధానంగా శ్రీముఖి "ఇవి సాంప్రాదాయం కల దుస్తులు కావా? అని ప్రశ్నించింది. మరి ఆ టైలర్ ఎందుకు మెడ దగ్గర గ్యాప్ ఇచ్చాడు అని అడిగాడు. శ్రీముఖి కూడా జోవియల్ గా సమాధానం ఇస్తూ 'మీలాంటి వాళ్ళు చూసేందుకు అలా డ్రెస్సులు అలా కుట్టిస్తామని సరదాగా చెప్పింది. నిజానికి ఆమె డ్రెస్ ఇండీసెంట్ గా ఏమీ లేదు.. బిత్తిరి సత్తి కూడా ఏదో ఫన్నీగా అన్నాడు కానీ అతని కామెంట్స్ వల్గర్ గా ఏమీ లేవు.
అంతా ఓకే కానీ కొన్ని టీవీ ఛానల్స్ కు ఈ ఫన్ నచ్చలేదు. దీనిపై ఫుల్ ఫ్రస్ట్రేషన్ జనాలను పట్టుకొచ్చి మహా ఫ్రస్ట్రేటెడ్ డిబేట్స్ రన్ చేశాయి. మహిళలు ఎలాంటి దుస్తులు వేసుకోవాలో మగాళ్ళు నిర్ణయించడం ఏంటని ఒక మేథావి అంటే.. మరో జీనియస్ బిత్తిరి సత్తి తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాడు. ఈ చర్చలు మన టీవీ ఛానల్స్ లో ఏ రకంగా సాగుతాయో అందరికీ తెలిసిందే కాబట్టి వాటి గురించి మళ్ళీ వివరించనవసరం లేదు.
అయినా చర్చలు జరపాలనుకుంటే జనాలకు ఉపయోగపడే టాపిక్స్ చాలానే ఉన్నాయి. వాటిని వదిలేసి ఇలా శ్రీముఖిపై బిత్తిరి సత్తి చేసిన కామెంట్స్.. దానికి శ్రీముఖి రియాక్షన్ ఇవి మన ఛానల్స్ కు అతిముఖ్యమైన సమస్యగా మారాయి. ఇదంతా చూస్తుంటే బిత్తిరి సత్తి ఈ డిబేట్ల మీద ఒక తీన్మార్ అస్త్రం సంధించాల్సి వచ్చేలా ఉంది.