Begin typing your search above and press return to search.

స్టార్ హీరో అజిత్ భార్య‌కు చేదు అనుభ‌వం..ఫ్యాన్స్ ఆగ్ర‌హం!

By:  Tupaki Desk   |   4 Feb 2022 4:30 AM GMT
స్టార్ హీరో అజిత్ భార్య‌కు చేదు అనుభ‌వం..ఫ్యాన్స్ ఆగ్ర‌హం!
X
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్‌ స‌తీమ‌ణి, ఒక‌ప్ప‌టి హీరోయిన్ షాలిని గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మూడేళ్ళ వయసులోనే మలయాళం మూవీతో సినీ రంగ‌ప్రవేశం చేసిన షాలిని.. `అనియతిప్రవు` సినిమాతో హీరోయిన్‌గా మారింది. ఈ చిత్రం మంచి విజ‌యం సాధించ‌డంతో ఆమెకు మ‌రిన్ని అవ‌కాశాలు వెల్లువెత్తాయి.

ఇటు తెలుగులో `సఖి`తో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్న ఈ భామ‌.. కెరీర్ పీక్స్‌లో ఉన్న‌ప్పుడే అజిత్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుని సినిమాల‌కు గుడ్‌బై చెప్పేసింది. ఇక‌పోతే తాజాగా షాలినికి ఓ చేదు అనుభవం ఎదురైంది. అస‌లేం జ‌రిగిందంటే.. ఈ మధ్య కాలంలో స్టార్ హీరోల భార్యలకు సంబంధించి ఫేక్ సోష‌ల్ మీడియా అకౌంట్లు తెగ హల్చల్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. మొన్న‌టికి మొన్న ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి పేరుతో ఓ ఫేక్ అకౌంట్ ప్రత్యక్షమైంది.

ఇక తాజాగా ఎవ‌రో గుర్తుతెలియని వ్యక్తులు షాలిని పేరుతోనూ ఓ ట్విట్ట‌ర్ అకౌంట్‌ను క్రియేట్ చేశారు. మిస్సెస్‌ షాలిని అజిత్‌కుమార్‌ పేరుతో క్రియేట్ అయిన ఈ అకౌంట్‌ను చాలా మంది రియల్ అని భావించారు. దీంతో ఆమెను ఫాలో చేయ‌డం స్టార్ట్ చేశారు. అయితే ఈ ఖాతాను గుర్తించిన‌ అజిత్‌ కుమార్‌ కార్యాలయ సిబ్బంది వెంట‌నే అది ఫేక్‌ అకౌంట్ అని అల‌ర్ట్ చేసింది.

షాలినికి ఎలాంటి సోషల్‌ మీడియా ఖాతా లేదని.. ద‌య‌చేసి ఆమె పేరుతో ఉన్న ట్విట్ట‌ర్ అకౌంట్‌ను గుడ్డిగా ఫాలో అవ్వొద్ద‌ని అజిత్‌ కుమార్‌ వ్యక్తిగత పీఆర్వో పేర్కొన్నారు. ఏదేమైన‌ప్ప‌టికీ.. ఇప్పుడు ఈ ఫేక్ అకౌంట్ల బెడ‌ద ఆయా హీరో, హీరోయిన్ల ఫ్యాన్స్‌కి తీవ్ర ఆగ్ర‌హం తెప్పిస్తోంది.