Begin typing your search above and press return to search.
మేజర్ - ను పట్టించుకోని బీజేపీ ! ఎందుకట !
By: Tupaki Desk | 15 Jun 2022 6:30 AM GMTమేజర్ సినిమాను బీజేపీ పట్టించుకోలేదు. 26 /11 దాడుల నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కింది. హీరో ఘట్టమనేని మహేశ్ బాబు ఎంతో బాధ్యతగా ఈ సినిమా నిర్మాణ బాధ్యతలు అందుకున్నారు.
తదనుగుణ రీతిలో పూర్తి చేశారు. అడవి శేష్ కథ అందించగా, శశికిరణ్ తిక్క దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంది. మరో ఫేమస్ రైటర్ అబ్బూరి రవి ప్రాజెక్టుకు స్క్రిప్ట్ అజర్వర్ గా పనిచేశారు. ఆయనే మాటలు రాశారు.
ఈ సినిమాను బీజేపీ పట్టించుకోలేదు. ఎందుకనో కానీ శివసేన పట్టించుకున్న విధంగా, జనసేన పట్టించుకున్న విధంగా, మెగాస్టార్ చిరు పట్టించుకున్న విధంగా పట్టించుకోలేదు. అంటే ఆ అమరుడి కథ మాకెందుకులే అని అనుకున్నారా ? లేకా బీజేపీని ఫక్తుగా వ్యతిరేకిస్తున్న యథార్థ వాదిగా తనని తాను ప్రేమించుకునే, ప్రకటించుకునే ప్రకాశ్ రాజ్ నటించిన కారణంగానే ఈ సినిమాను పట్టించుకోలేదా ?
ఇవే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. వాస్తవానికి కశ్మీర్ ఫైల్స్ సినిమాను ఆకాశానికి ఎత్తేసిన బీజేపీ గ్యాంగ్ ఎందుకనే మేజర్ సినిమాను పట్టించుకోకపోవడం వెనుక ఏమయినా కారణాలు ఉన్నాయా ? ఉంటే అవి రాజకీయ సంబంధం అయినవా లేదా సామాజిక పరం అయినవా ? ఈ ప్రశ్నలకు కూడా సమాధానాలు వెతుక్కుంటే అప్పుడు మేజర్ అందరి వాడా లేదా కొందరి వాడా అన్నది తేలిపోతుంది.
కాశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రిని, అదేవిధంగా నిర్మాణ బాధ్యతలు చూసిన ప్రొడక్షన్ బాధ్యతలు చూసిన అభిషేక్ అగర్వాల్ ని ఆకాశానికి ఎత్తేసిన బీజేపీ అందులో పావు వంతు కూడా పట్టించుకోలేదు. బీజేపీ పట్టించు కోలేదు సరికదా ! ఆమ్ ఆద్మీ పార్టీ కూడా మేజర్ ను పట్టించుకోలేదు.
కాశ్మీర్ ఫైల్స్ కు వినోద పన్ను రాయితీ ఇచ్చిన కొన్ని బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎందుకనో మేజర్ కు కనీస స్థాయిలో మాట సాయం కూడా చేయలేదు. అదేవిధంగా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ పెద్దలు కూడా మేజర్ ను పట్టించుకోకపోవడం విచారకరం.