Begin typing your search above and press return to search.
'భీష్మ'పై బీజేపీ కన్నెర్ర
By: Tupaki Desk | 18 Feb 2020 5:58 AM GMTసినిమా టైటిల్స్ పై వివాదాలు కొత్తేమీ కాదు. బాలీవుడ్.. టాలీవుడ్ నిత్యం ఇలాంటి వివాదాల్లో ఎక్కువగా నలుగుతూనే ఉన్నాయి. మనోభావాలు దెబ్బతిన్నాయి అంటూ కోర్టులు కేసులు చూస్తున్నదే. కోర్టు గొడవలతో చివరికి రాజీకి వచ్చి ... ఎవరీని కించ పరచని టైటిల్స్ ని వెతుక్కోవడం..అందులో పాత్రల పేర్లు కూడా మార్చడం చూశాం. ఆ మధ్య వరుణ్ తేజ్ హీరోగా నటించిన `వాల్మీ`కి టైటిల్ పై బోయ వాల్మీకిలు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. చివరికి దర్శకుడు హరీష్ శంకర్ వాల్మీకి టైటిల్ కి బదులుగా `గద్దలకొండ గణేష్` అని మార్చారు.
తాజాగా యూత్ స్టార్ నితిన్-రష్మిక జంటగా నటించిన `భీష్మ` టైటిల్ పైనా రగడ మొదలైంది. భీష్మ పేరుతో సినిమా తెరకెక్కించడంపై బీజీపీ ధార్మిక సెల్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేసారు. భీష్ముడు మహాభారతానికి మూల పురుషుడు..ఆ జన్మ బ్రహ్మచర్యం పాటించిన వాడు. అలాంటి గొప్ప వ్యక్తి పేరుతో సినిమా తెరకెక్కించి విడుదల చేయడం అంటే హిందువుల మనోభావాలు దెబ్బతీయడమే అంటూ లాజిక్ వెతికారు. వెంటనే టైటిల్ మార్చి సినిమా రిలీజ్ చేయాలని..లేదంటే రిలీజ్ ను అడ్డుకుంటామని హెచ్చరించారు.
ఒక లవర్ బోయ్ పాత్రకు `భీష్మ` టైటిల్ పెట్టడం బాధాకరం. చరిత్రలో భీష్ముడు లవర్ బోయా? మీ ఇష్టాను సారం సినిమాలు తీసేస్తారా? పుంకాలు పుంకాలుగా పుస్తకాలు చదవి దర్శక రచయితలు సినిమాలు చేస్తారు. ఇలాంటి టైటిల్ పెట్టి సినిమా చేస్తే మనోభావాలు దెబ్బతింటాయి అన్న విషయాలు మాత్రం గుర్తు ఉండవా? సినిమా వ్యాపారం కోసం చరిత్రలను వక్రీకరిస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు భాజపా వర్గీయులు. రిలీజ్ లోపు కొత్త టైటిల్ ప్రకటన రాకపోతే కోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించడం చర్చనీయాంశమైంది.