Begin typing your search above and press return to search.
వివాదాస్పద హీరోయిన్ కు రాజకీయ మద్దతు
By: Tupaki Desk | 31 Aug 2020 4:15 AM GMTబాలీవుడ్ పెద్దలపై ఎప్పటికప్పుడు ఏదో ఒక సంచలన వ్యాఖ్య చేస్తూనే ఉన్న కంగనా రనౌత్ ఈమద్య కాలంలో సుశాంత్ మృతి చెందిన తర్వాత మరింత ఎక్కువగా మీడియాలో కనిపిస్తుంది. ఆమె బాలీవుడ్ పెద్దల బండారాలు బయట పెడతానంటూ ఇటీవల వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. ఇక రియా చక్రవర్తి కి డ్రగ్స్ డీలర్ తో సంబంధం ఉందంటూ వెళ్లడయినప్పటి నుండి కూడా కంగనా ఆ విషయమై పలు వ్యాఖ్యలు చేస్తోంది. బాలీవుడ్ ప్రముఖులు ఎంతో మంది డ్రగ్స్ తీసుకుంటారంది.
ప్రముఖ దర్శకుడు ఒకరు నాకు డ్రగ్స్ అలవాటు చేయాలని చాలా ప్రత్నించాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇక ఒక రాజకీయ యువ నాయకుడిపై కూడా ఈమె చేస్తున్న వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇలాంటి సమయంలో ఆమె ప్రాణాలకు ముప్పు ఉందని అంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఆమెకు భద్రత కల్పించక పోవడంపై బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మహారాష్ట్ర సీఎంకు బీజేపీ నేత రామ్ కదం లేఖ రాశారు. అందులో కంగనా డ్రగ్స్ మాఫియాను మొత్తం బయట పెడుతాను అంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. అలాంటి ఆమెకు ఎటు వైపు నుండి అయినా ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. కనుక ఆమెకు ఎందుకు మీరు సెక్యూరిటీ ఇవ్వడం లేదంటే ప్రశ్నించాడు. ఇప్పటి వరకు ఆమెను భద్రత కల్పించే విషయంలో ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాకపోవడం దురదృష్టకరం అంటూ ఆయన పేర్కొన్నాడు. కంగనా విషయంలో ఇప్పుడు బీజేపీ మరియు మహారాష్ట్ర అధికార పార్టీ శివసేనలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. దాంతో కంగనా ఇష్యూ ఇప్పుడు రాజకీయంగా కూడా చర్చనీయాంశం అయ్యింది.