Begin typing your search above and press return to search.
దీపికా పదుకొనే బికినీ రచ్చపై మంత్రి ఫైర్!
By: Tupaki Desk | 14 Dec 2022 2:11 PM GMTషారుఖ్ ఖాన్, దీపికా పదుకొనే జంటగా నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ `పఠాన్`. సిద్ధార్ధ్ ఆనంద్ తెరకెక్కిస్తున్న ఈ మూవీపై వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్ చేసిన దగ్గరి నుంచే ఈ మూవీని బాయ్ కాట్ చేయాలంటూ ప్రచారం జోరందుకుంది. తాజాగా దీపిక పదుకొనే, షారుక్ ఖాన్ లపై చిత్రీకరించిన `భేషరమ్ రంగ్` సాంగ్ ని విడుదల చేయడంతో వివాదం మరింతగా ముదిరి బాయ్ కాట్ అంటూ నెట్టింట రచ్చ మొదలైంది.
ఈ పాటలో హీరోయిన్ దీపికా పదుకొనే రెచ్చిపోయి అందాల విందు చేసింది. ఇంత వరకు ఈ రేంజ్లో టూ పీస్ బికినీల్లో కనిపించని దీపిక ఈ పాటలో రెచ్చిపోయి అందాల విందు చేయడం ఇదే తొలిసారి. అందులోనూ కాషాయ రంగు బికినీలో టూమచ్ గ్లామర్ షో చేయడమే కాకుండా థై షోతో మరింతగా కాకరేపింది. ఈ పాటలో దీపిక మరింత వల్గర్ గా కనిపించడంతో హిందూ సంఘాలు, నెటిజన్ లు తీవ్ర అభ్యంతరంవ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేయడం మొదలు పెట్టారు.
తాజాగా ఈ పాటపై మధ్యప్రదేశ్ హోమ్ మినిస్టర్ నరోత్తమ్ మిశ్రా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ పాటలో దీపిక పదుకొనే వేసుకున్న డ్రెస్ పై తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఆ సీన్ లను తొలగించకపోతే తమ రాష్ట్రంలో `పఠాన్` సినిమా ప్రదర్శనపై ఏం చేయాలో ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు. బుధవారం ఇండోర్ లో విలేఖరులతో మాట్లాడుతూ `భేషరమ్ రంగ్` పాటలో దీపిక కాస్ట్యూమ్స్ తీవ్ర అభ్యంతరకంగా వున్నాయన్నారు. కలుషితమైన మనస్థత్వంలో ఈ పాటను చిత్రీకరించినట్టుగా వుందన్నారు.
ఈ సీన్ లను, పాటలోని దీపిక కాస్ట్యూమ్స్ ని సరిచేయాలని కోరుతున్నా అని తెలిపారు. లేదంటే మధ్యప్రదేశ్ లో ఈ సినిమా ప్రదర్శించాలా? వద్దా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతుందన్నారు. అంతే కాకుండా జేఎన్ యూ కేసులో తుక్డే తుక్డే గ్యాంగ్ కు దీపిక మద్దతు దారుగా కనిపించారని తెలిపారు. ఢిల్లీ జేఎన్ యూ ఘటన తరువాత నుంచి బీజేపీ నేతలు తుక్డే తుక్డే గ్యాంగ్ అనే పదాన్ని తరచూ వాడుతున్న విషయం తెలిసిందే.
ఇదిలా వుంటే `పఠాన్` మూవీని వచ్చే ఏడాది 2023 జనవరి 25న అత్యంత భారీ స్థాయిలో హిందీ, తమిళ, తెలుగు భాషల్లో విడుదల చేయబోతున్నారు. యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా ఈ మూవీని నిర్మిస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.